రుణరేటు పెంచిన LICHFL.. గృహ రుణాలు మరింత భారం

LICHFL Rate hike: ప్రముఖ గృహ రుణ సంస్థ ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్ తన ప్రైమ్‌ లెండింగ్‌ రేటును పెంచింది. ఇకపై 8.65 శాతం వడ్డీ నుంచి ప్రారంభం కానున్నాయి.

Published : 26 Dec 2022 23:02 IST

ముంబయి: ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్‌బీఐ రెపో రేట్లు పెంచడంతో బ్యాంకులు, గృహ రుణ సంస్థలు సైతం తమ రుణ రేట్లను సవరిస్తున్నాయి. ప్రైవేటు రంగానికి చెందిన ప్రముఖ గృహ రుణ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) ఇటీవలే రుణ రేటును 0.35 శాతం మేర పెంచింది. తాజాగా ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (LIC HFL) సైతం అంతేమొత్తాన్ని పెంచింది. ఇకపై గృహ రుణాలపై వడ్డీ 8.65 శాతం నుంచి ప్రారంభమవుతుందని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా తమ ప్రైమ్‌ లెండింగ్‌ రేట్‌ను 0.35 శాతం పెంచినట్లు ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ రంగంలో గృహ కొనుగోళ్లు స్థిరంగా కొనసాగుతున్నాయని పేర్కొంది. ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకు ఆర్‌బీఐ 2.25 శాతం మేర రెపో రేటును పెంచిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే తమ రుణరేటు పెంచినట్లు తెలిపింది. ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తాజా నిర్ణయంతో కొత్తగా గృహ రుణాలు తీసుకునే వారికి, ఇప్పటికే తీసుకున్నవారికి ఈఎంఐలు ప్రియం కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని