Maruti Suzuki: కలిసొచ్చిన విక్రయాలు.. మారుతీ సుజుకీ లాభంలో 33% వృద్ధి

Maruti Suzuki Q3 Results: కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాలను బుధవారం ప్రకటించింది.

Updated : 31 Jan 2024 18:04 IST

Maruti Suzuki Q3 Results | దిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) త్రైమాసిక ఫలితాలను బుధవారం ప్రకటించింది. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో (Q3 Results) ఏకీకృత ప్రాతిపదికన రూ.3,207 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,406 కోట్లతో పోలిస్తే  33శాతం అధికం. కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రూ.29,251 కోట్ల నుంచి 15శాతం పెరిగి రూ.33,513 కోట్లకు చేరింది.

2023లో పసిడికి గిరాకీ 5 శాతం పడిపోయింది

విక్రయాల పరంగా చూస్తే.. గతేడాది మూడో త్రైమాసికంలో 4,65,911 యూనిట్లు విక్రయించగా.. ఈసారి 5,01,207 అమ్ముడయ్యాయని తెలిపింది. విక్రయాల్లో 8శాతం వృద్ధి నమోదైంది. దేశీయ వాహన విక్రయాలు 4,03,929 నుంచి 4,29,422కు చేరాయి. ఇప్పటివరకు ఏ త్రైమాసికంలోనూ లేనంతగా 71,785 కార్లను ఎగుమతి చేసినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో మారుతీ సుజుకీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.10శాతం పెరిగి రూ.10,161.05 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని