Nita Ambani: బనారసీ చీరలో మెరిసిన నీతా అంబానీ

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ‘స్వదేశ్‌’ ప్రోత్సహించే అనేక కళారూపాల్లో బనారసీ నేత ఒకటి. తాజాగా నీతా అంబానీ (Nita Ambani) బనారసీ చీరలో మెరిశారు. 

Updated : 29 Aug 2023 23:15 IST

ముంబయి: రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్ పర్సన్‌ నీతా అంబానీ (Nita Ambani) బనారసీ చీరలో తళుక్కున మెరిశారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ 46వ వార్షిక సమావేశంలో ఆమె వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీతా అంబానీ మెడికల్‌ అండ్‌ కల్చరల్‌ కాంప్లెక్స్‌ (ఎన్‌ఎంఏసీసీ), రిలయన్స్‌ ఫౌండేషన్‌ చేపట్టనున్న పలు కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా నీతా అంబానీ ధరించిన బనారసీ బ్రొకేడ్‌ చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళాకారుడు ఇక్బాల్ అహ్మద్‌ చేతిలో ఈ చీర రూపుదిద్దుకుంది. హస్తకళల్లో ఈ వారణాసి చీరలకు శతాబ్దాల చరిత్ర ఉంది. అందుకే నీతా అంబానీ ధరించిన చీర సంప్రదాయ జరీ వర్క్‌ను భారతీయ వైవిధ్యత ప్రతిబింబించేలా డిజైన్‌ చేశారు. 

హీరో కరిజ్మా వచ్చేసింది.. ధర, ఇతర వివరాలు ఇవే..!

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ‘స్వదేశ్‌’ ప్రోత్సహించే అనేక కళారూపాల్లో బనారసీ నేత ఒకటి. భారతీయ సంప్రదాయ కళలు, హస్తకళలను కాపాడేందుకు, ప్రోత్సహించేందుకు రిలయన్స్‌ ఫౌండేషన్‌ ప్రత్యేక చొరవ చూపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నీతా అంబానీ చేనేత చీర ధరించి సంప్రదాయ కళాకారులు, వారి వారసత్వాన్ని అందుకొని సాగిపోతున్న నేటి తరాన్ని ప్రోత్సహిస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని