OnePlus Diwali 2023 Sale: త్వరలో వన్‌ప్లస్‌ దీపావళి సేల్‌.. ఫోన్లు, బడ్స్‌, ట్యాబ్స్‌పై ఆఫర్లివే..!

OnePlus Diwali 2023 Sale: పండగ సీజన్‌ నేపథ్యంలో ఈ-కామర్స్‌ సంస్థలతో పాటు ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థలు సైతం ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా వన్‌ప్లస్‌.. దీపావళి సేల్‌ను ప్రకటించింది.

Published : 01 Oct 2023 16:34 IST

OnePlus Diwali 2023 Sale | ఇంటర్నెట్‌ డెస్క్‌: దీపావళి సేల్‌ 2023 (OnePlus Diwali 2023 Sale)ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్‌ ప్రకటించింది. తేదీలు, ప్రత్యేక ఆఫర్లను ఇంకా వెల్లడించనప్పటికీ.. ఏయే ఉత్పత్తులపై ఆఫర్లు ఉన్నాయో మాత్రం తెలిపింది. వన్‌ప్లస్‌ యాప్‌ ద్వారా కొనుగోలు చేయబోయే వారికి అదనపు ప్రయోజనాలు ఉంటాయని పేర్కొంది. వన్‌ప్లస్‌ 11 5జీ, వన్‌ప్లస్‌ బడ్స్‌ ప్రో2, వన్‌ప్లస్‌ ప్యాడ్‌ ట్యాబ్లెట్‌పై ఆకర్షణీయ ఆఫర్లు ఉన్నట్లు తెలిపింది.

యాప్‌ ద్వారా కొనుగోలు చేయబోయే వారికి ఈ సేల్‌ (OnePlus Diwali 2023 Sale)లో  18 నెలల ఈఎంఐ, ఎంపిక చేసిన మోడల్స్‌పై ఉచిత యాక్సెసరీస్‌ వంటి వాటిని అందించనున్నట్లు వన్‌ప్లస్‌ తెలిపింది. వన్‌ప్లస్‌ 11 5జీ స్మార్ట్‌ఫోన్‌ రూ.49,999 రాయితీ ధర వద్ద లభించనున్నట్లు కంపెనీ తమ వెబ్‌సైట్‌లో తెలిపింది. బ్యాంకు ఆఫర్లనూ ఉపయోగించుకొని మరో రూ.4,000 ఆదా చేసుకోవచ్చు. దీనిపై బడ్స్‌ జెడ్‌2 టీడబ్ల్యూఎస్‌ ఇయర్‌ఫోన్స్‌ ఉచితంగా లభిస్తాయి. ప్రస్తుతం ఈ ఫోన్‌ ధర భారత్‌లో రూ.56,999. ఈ సేల్‌లో వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 3 లైట్‌ 5జీ ఫోన్‌ రూ.17,499, వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5జీ రూ.28,999, వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 3 5జీ రూ.22,999 ప్రారంభ ధర వద్ద లభించనున్నట్లు తెలిపింది. ఈ ధరలు బ్యాంకు ఆఫర్లతో కలిపి అని వన్‌ప్లస్‌ వెల్లడించింది.

వన్‌ప్లస్‌ బడ్స్‌ ప్రో 2 ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్స్‌ ఈ సేల్‌ (OnePlus Diwali 2023 Sale)లో బ్యాంకు రాయితీలతో కలిపి రూ.7,999కు లభించనుంది. ఈ ఇయర్‌ఫోన్స్‌ ఈ ఏడాది మార్చిలో మార్కెట్‌లోకి వచ్చాయి. వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 2 టీడబ్ల్యూఎస్‌ ఇయర్‌బడ్స్‌ బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.2,299లకు అందుబాటులో ఉంది. మరోవైపు వన్‌ప్లస్‌ బుల్లెట్స్‌ వైర్‌లెస్‌ జెడ్‌2 బ్యాంకు రాయితీలతో కలుపుకొని రూ.1,349, వన్‌ప్లస్‌ నార్డ్‌ వైర్డ్‌ ఇయర్‌ఫోన్స్‌ రూ.599కు సేల్‌లో ఉన్నాయి.

మరోవైపు ఈ సేల్‌ (OnePlus Diwali 2023 Sale)లో వన్‌ప్లస్‌ ప్యాడ్‌ రూ.36,999 తగ్గింపు ధర వద్ద లభించనున్నట్లు వెబ్‌సైట్‌లో కంపెనీ పేర్కొంది. త్వరలో విడుదల కానున్న వన్‌ప్లస్‌ ప్యాడ్‌ గోను సైతం ఈ సేల్‌లో విక్రయానికి ఉంచనున్నట్లు తెలిపింది. అయితే, ధరను మాత్రం అక్టోబర్‌ 6 విడుదల తర్వాతే ప్రకటిస్తామని కంపెనీ చెప్పింది. స్మార్ట్‌వాచ్‌ల విషయానికి వస్తే.. నార్డ్‌ వాచ్‌ రూ.4,999 వద్ద దీపావళి సేల్‌లో అందుబాటులో ఉండనుంది. వన్‌ప్లస్‌ టీవీ 65 క్యూ2 ప్రో కొనుగోలుదారులకు అదనంగా రూ.5,000 తగ్గింపు లభించనుంది. దీని అసలు ధర రూ.94,999.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని