RIL q2 Results: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాభం 27 శాతం వృద్ధి

Reliance Industries q2 results: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రెండో త్రైమాసికానికి నికర లాభం 27 శాతం పెరిగి రూ.17,394 కోట్లుగా నమోదైంది.

Published : 27 Oct 2023 20:40 IST

Reliance Industries | దిల్లీ: ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) త్రైమాసిక ఫలితాలను (q2 results) ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై- సెప్టెంబర్‌ త్రైమాసికంలో నికర లాభంలో 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.13,656 కోట్ల నుంచి లాభం రూ.17,394 కోట్లకు పెరిగింది. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ వ్యాపారం తిరిగి పుంజుకోవడం, ఫ్యాషన్‌ అండ్‌ లైఫ్‌ స్టయిల్‌, గ్రాసరీ, ఇ-కామర్స్‌ వ్యాపారం వృద్ధిని నమోదు చేయడంతో లాభం పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ.2.34 లక్షల కోట్లుగా నమోదైంది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికాం కంపెనీ జియో క్యూ2లో స్టాండలోన్‌ పద్ధతిన రూ.5,058 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది రూ.4,518 కోట్లతో పోలిస్తే 12 శాతం పెరగడం గమనార్హం. కార్యకలాపాల ఆదాయం 9.8 శాతం వృద్ధి చెంది రూ.24,750 కోట్లుగా జియో ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని