RIL AGM: రిలయన్స్‌ ఏజీఎం తేదీ ఫిక్స్‌.. కీలక ప్రకటనలు వీటిపైనే..!

Reliance Industries AGM: రిలయన్స్‌ ఏజీఎం తేదీ ఖరారైంది. ఆగస్టు 28న ఈ సమావేశం జరగనుంది. జియో ఫైనాన్షియల్‌ విభజన అనంతరం జరుగుతున్న ఈ ఏజీఎంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated : 05 Aug 2023 15:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీకి (Mukesh ambani) చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (Reliance Industries) వార్షిక సాధారణ సమావేశం (AGM) తేదీ ఖరారైంది. ఆగస్టు 28న మధ్యాహ్నం 2 గంటలకు వర్చువల్‌ పద్ధతిలో 46వ వార్షిక సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని ఆ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.9 చొప్పున డివిడెండ్‌ చెల్లింపులకు రికార్డు తేదీని ఆగస్టు 21గా నిర్ణయించింది.

సాధారణంగా ఏ కంపెనీ వార్షిక సమావేశమైనా ఆయా కంపెనీల వాటాదారులకు, మార్కెట్‌ పట్ల అవగాహన ఉన్న వారికి కాస్త ఆసక్తి ఉంటుంది. రిలయన్స్‌ విషయంలో మాత్రం అలా కాదు. సాధారణ ప్రజలు సైతం రిలయన్స్‌ ఏజీఎం పట్ల ఆసక్తి కనబరుస్తారు. రిలయన్స్‌ జియో, జియో 5జీ సేవలు, ల్యాప్‌టాప్‌, రిలయన్స్‌ 4జీ ఫోన్‌ వంటివన్నీ ఈ ఏజీఎం వేదికలుగానే ప్రకటించారు. అలాగే, 45వ ఏజీఎంలో మెటాతో భాగస్వామ్యం, జియో ఎయిర్‌ ఫైబర్‌, జియో 5జీ ఫోన్‌ గురించీ ప్రకటనలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఏజీఎంలో ఎలాంటి ప్రకటనలు ఉండబోతున్నాయన్నదానిపై ఆసక్తి నెలకొంది.

ఈ స్మాల్‌ గ్యాడ్జెట్స్‌తో మీ ఇల్లు మరింత స్మార్ట్‌

ఈ సారి వార్షిక సమావేశంలో ప్రధానంగా రిలయన్స్‌ జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌పై కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ను విభజించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీల్లో తాత్కాలికంగా ఈ షేరు అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి లిస్టింగ్‌ తేదీపై ఈ ఏజీఎంలో ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే, జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రపంచ అతిపెద్ద అసెట్‌ మేనేజర్‌ అయిన బ్లాక్‌రాక్‌తో జట్టుకట్టింది. ఈ నేపథ్యంలో జియో ఫైనాన్షియల్‌ లక్ష్యాలను ముకేశ్‌ అంబానీ ఏజీఎం వేదికగా వివరించే అవకాశం ఉంది. ఫైనాన్షియల్‌ విభాగంతో పాటు టెలికాం, రిలయన్స్‌ రిటైల్‌ వ్యాపారాలకు సంబంధించిన కీలక ప్రకటనలు కూడా వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని