Sept 30 Deadline: పాన్‌, ఆధార్‌ సమర్పించారా? లేదంటే ఆ ఖాతాలు స్తంభించిపోతాయ్‌!

Sept 30 Deadline: పీపీఎఫ్‌, ఎస్‌ఎస్‌వై సహా పలు చిన్న మొత్తాల పొదుపు పథకాలకు పాన్‌, ఆధార్‌ తప్పనిసరిగా సమర్పించాలి.

Updated : 26 Sep 2023 12:24 IST

Sept 30 Deadline | ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో (small savings schemes) మదుపు చేస్తున్న వారు తప్పనసరిగా పాన్‌ (PAN), ఆధార్‌ (Aadhaar) వివరాలను సమర్పించాలి. అందుకు 2023 సెప్టెంబరు 30తో గడువు ముగియనుంది (Sept 30 Deadline). వివరాలను సమర్పించని వారి ఖాతాలను స్తంభింపజేస్తారు. తిరిగి ఆయా పత్రాలు సమర్పించే వరకు ఖాతాలను నిర్వహించడం కుదరదు. అంటే ఎలాంటి లావాదేవీలు జరపడానికి ఆస్కారం ఉండదు.

ఇప్పటికే పాన్‌ (PAN), ఆధార్‌ (Aadhaar) వివరాలను సమర్పించిన ఖాతాదారులు మరోసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. 2023 ఏప్రిల్‌ 1 తర్వాత చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో (Small savings schemes) ఇన్వెస్ట్‌ చేస్తున్నవారికి ప్రభుత్వం పాన్‌ను తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కొత్తగా ఖాతాలు తీసుకున్నవారు తిరిగి ఆయా పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు.

పొదుపు తగ్గి అప్పు పెరుగుతోందా? ఈ వ్యూహాలను అనుసరిద్దాం!

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (NSC), సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (SCSS) సహా పలు ఇతర పథకాలు చిన్న మొత్తాల పొదుపు పథకాల (Small savings schemes) కిందకు వస్తాయి. చాలా మంది సామాన్యులు వీటిలో మదుపు చేస్తుంటారు. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్స్‌, నష్ట భయం పెద్దగా భరించలేని చిరుద్యోగుల్లో వీటికి ఆదరణ బాగా ఉంటుంది. వీటిపై వడ్డీరేట్లను ప్రభుత్వం ప్రతి మూడునెలలకోసారి సమీక్షిస్తుంటుంది. 2023 జులై- సెప్టెంబర్‌ త్రైమాసికానికి కొన్ని పథకాలపై వడ్డీరేట్లను 10 నుంచి 30 బేసిస్‌ పాయింట్లు పెంచింది. అయితే, ఎస్‌సీఎస్‌ఎస్‌ (SCSS), పీపీఎఫ్‌ (PPF), కిసాన్‌ వికాస్‌ పత్ర, సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి పథకాలపై మాత్రం వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. పీపీఎఫ్‌ (PPF)పై వడ్డీరేటును 2020 ఏప్రిల్‌ నుంచి 7.1 శాతంగా కొనసాగిస్తోంది.

వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లు..

  • సేవింగ్స్‌ డిపాజిట్‌- 4%
  • ఏడాది టైమ్‌ డిపాజిట్‌- 6.9%
  • రెండేళ్ల టైమ్‌ డిపాజిట్‌- 7.0%
  • మూడేళ్ల టైమ్‌ డిపాజిట్‌- 7.0%
  • ఐదేళ్ల టైమ్‌ డిపాజిట్‌- 7.5%
  • ఐదేళ్ల రికరింగ్‌ డిపాజిట్‌- 6.5%
  • సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌- 8.2%
  • మంత్లీ ఇన్‌కమ్‌ అకౌంట్‌ స్కీమ్‌- 7.4%
  • నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌- 7.7%
  • పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ స్కీమ్‌- 7.1%
  • కిసాన్‌ వికాస్‌ పత్ర- 7.5 %
  • సుకన్య సమృద్ధి యోజన-8.0%
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని