IPO: ఈ వారం రెండు ఐపీవోలు

ఈ వారం రెండు కంపెనీలు ఐపీవోలకు రానున్నాయి. క్లీన్‌ సైన్స్‌ అండ్‌  టెక్నాలజీ, జీఆర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ సంస్థలు వాటాలు విక్రయించి దాదాపు రూ.2,510 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకొన్నాయి. ఇటీవల కాలంలో మార్కెట్‌ సూచీలు దూకుడుగా ఉండటం.. కొత్త ఇన్వెస్టర్లు పెరగడంతో ఐపీవోకు ఇదే మంచి సమయంగా

Published : 04 Jul 2021 13:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ వారం రెండు కంపెనీలు ఐపీవోలకు రానున్నాయి. క్లీన్‌ సైన్స్‌ అండ్‌  టెక్నాలజీ, జీఆర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ సంస్థలు వాటాలు విక్రయించి దాదాపు రూ.2,510 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకొన్నాయి. ఇటీవల కాలంలో మార్కెట్‌ సూచీలు దూకుడుగా ఉండటం.. కొత్త ఇన్వెస్టర్లు పెరగడంతో ఐపీవోకు ఇదే మంచి సమయంగా ఈ సంస్థలు భావించాయి. క్లీన్‌ సైన్స్‌, జీఆర్‌ ఇన్‌ఫ్రా ఐపీవోలు బిడ్డింగ్‌లను జులై 7 నుంచి మొదలు పెట్టి 9వ తేదీ వరకు స్వీకరిస్తాయి. ఇక యాంకర్‌ ఇన్వెస్టర్ల బిడ్డింగ్‌ జులై 6వ తేదీనే మొదలవుతుంది.

క్లీన్‌ సైన్స్‌ ఐపీవో విలువ రూ.1,546 కోట్లుగా భావిస్తున్నారు. ప్రస్తుత ప్రమోటర్లు, వాటాదారుల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయించనున్నారు. ఈ షేరు ప్రైస్‌బ్యాండ్‌ రూ.880-900 వరకు ఉంది. ఫార్మా , ఇతర రంగాలకు అవసరమైన ప్రత్యేకమైన రసాయనాలను ఈ సంస్థ తయారు చేస్తుంది. ఈ సంస్థకు కుర్‌కుంభ్‌లో పలు కర్మాగారాలు ఉన్నాయి. ఈ సంస్థ ఉత్పత్తులను భారత్‌తో పాటు చైనా, ఐరోపా, అమెరికా,తైవాన్‌,కొరియా,జపాన్‌లకు ఎగుమతి చేస్తుంది. కంపెనీ మూడింట రెండు వంతుల ఆదాయం ఎగుమతుల నుంచి వస్తుంది.

జీఆర్‌ ఇన్‌ఫ్రా సంస్థ షేరు ప్రైస్‌బ్యాండ్‌ను రూ.828-రూ.837 వరకు నిర్ణయించింది. ఉదయ్‌పూర్‌కు చెందిన ఈ సంస్థకు రోడ్‌ ఇంజినీరింగ్‌లో నైపుణ్యం ఉంది. దాదాపు 15 రాష్ట్రాల్లో హైవే ప్రాజెక్టులను చేస్తోంది. ఇటీవల రైల్వే రంగంలోకి కూడా అడుగుపెట్టింది.

ఇటీవలే మార్కెట్లోకి శ్యామ్‌ మెటాలిక్స్‌, సోనా బీఎల్‌బ్ల్యూ,కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌,దొడ్ల డెయిరీ,ఇండియన్‌ పెస్టిసైడ్స్‌ వాటాలను విక్రయించి రూ.9,923 కోట్లను సమీకరించాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 22 కంపెనీలు ఐపీవోలకు వచ్చి రూ.27,426 కోట్లను సేకరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని