Hyderabad: రివార్డు పాయింట్లతో ఎర.. రూ.1.92లక్షలు కాజేసిన సైబర్‌ కేటుగాళ్లు

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్‌ కేటుగాళ్లు హైదాబాద్‌కు చెందిన ఓ వ్యాపారిని మోసగించి రూ.1.92లక్షలు కాజేశారు. 

Published : 11 Apr 2024 00:07 IST

హైదరాబాద్‌: సైబర్‌ కేటుగాళ్లు వివిధ పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా రివార్డు పాయింట్ల పేరుతో హైదాబాద్‌కు చెందిన ఓ వ్యాపారిని మోసగించి రూ.1.92లక్షలు కాజేశారు. యాక్సిస్‌ బ్యాంక్‌ రివార్డు పాయింట్ల పేరుతో వ్యాపారికి ఓ లింక్‌ మెసేజ్‌ రూపంలో వచ్చింది. మోటార్‌ ఇన్సూరెన్స్‌ కోసం బ్యాంక్‌ పంపించిన లింక్‌గా భావించిన అతను దాన్ని ఓపెన్‌ చేసి వివరాలు నమోదు చేశారు. ఆ వెంటనే తన బ్యాంక్‌ ఖాతా నుంచి డబ్బు డెబిట్‌ అయినట్లు మెసేజ్‌ రావడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అపరిచిత లింకులను క్లిక్‌ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని