Crime News: అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం

ఝార్ఖండ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగి నలుగురు మహిళలు, నలుగురు చిన్నారులతో  సహా 14 మంది మృతి చెందారు.

Updated : 31 Jan 2023 23:06 IST

ధన్‌బాద్‌: ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో మంగళవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ధన్‌బాద్‌లోని ఆశీర్వాద్‌ అపార్ట్‌మెంట్‌లో భారీగా మంటలు చెలరేగి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు కూడా ఉన్నారు. అపార్ట్‌మెంట్‌లో మొత్తం 400 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో పలువురు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 13 అంతస్తులు ఉన్న ఈ భవనంలో తొలుత రెండో అంతస్తులో మొదలైన మంటలు క్రమంగా అపార్ట్‌మెంట్‌ అంతటా వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు. ఐదు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని