కొట్టుకుంటూ.. వీధుల్లో ఈడ్చుకెళ్లి...

ఇంటి యజమాని పైడి దాలప్పడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోపాలపట్నం సీఐ రమణయ్య ఆధ్వర్యంలో ఎస్సై సత్యనారాయణ అపహరణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీ భర్తను పోలీసులు విచారిస్తున్నారు. అతడికి ఇంతకముందే వివాహం జరిగిందని, రెండో

Updated : 09 Feb 2020 09:51 IST

● మహిళపై ఏడుగురు వ్యక్తుల మూకుమ్మడి దాడి

● కాపాడమని కేకలు పెట్టినా...స్పందించని స్థానికులు

గోపాలపట్నం : కుటుంబ కలహాల నేపథ్యంలో ఏడుగురు వ్యక్తులు ఓ మహిళపై నిర్థాక్షిణ్యంగా దాడి చేసి... వీధుల్లో కొట్టుకుంటూ సుమారు అరకిలోమీటరు మేర జట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లినా... చూసిన వారెవ్వరూ స్పందించలేదు. ఈ హృదయవిదారక సంఘటన శనివారం సాయంత్రం గోపాలపట్నంలో జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు... విశాఖ నగరానికి చెందిన గుత్తి లక్ష్మి (35) తన భర్త నాగరాజు, కుమారుడితో కలిసి జీవీఎంసీ 66వ వార్డు ఎల్లపువానిపాలెం గ్రామంలో గత ఏడేళ్లుగా అద్దింట్లో నివాసం ఉంటోంది. భర్త ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తుండగా ఆమె ఇంటి వద్దే ఉంటుంది. శనివారం సాయంత్రం ఇంట్లో ఆమె భర్త నాగరాజు లేని సమయంలో నగరానికి చెందిన అయిదుగురు మహిళలు, మరో ఇద్దరు పురుషులు కలిసి కారులో వచ్చారు. గ్రామ శివారులో కారుని ఉంచి లక్ష్మి వద్దకు వచ్చారు. ఆమెపై మూకుమ్మడిగా దాడి చేసి... కొట్టుకుంటూ వీధుల వెంబడి తీసుకెళ్లారు. కాపాడమని బాధితురాలు కేకలు పెట్టినా... స్థానికులు స్పందించలేదు. మానవత్వం మరిచిపోయిన వారంతా మహిళ రోదనను పెడచెవిన పెట్టారు. అలా ముందుకు తీసుకెళ్లిన వారు అక్కడ నుంచి బాధితురాలిని కారులో తీసుకెళ్లిపోయారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని విశ్వసనీయ సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని