Ragging: మూడో తరగతి విద్యార్థిపై సీనియర్ల దారుణం.. మర్మాంగాన్ని దారంతో కట్టి..
మూడో తరగతి విద్యార్థిపై.. నలుగురు సీనియర్ విద్యార్థులు దారుణంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా అతడి మర్మాంగాన్ని దారంతో కట్టారు.
దిల్లీ: మూడో తరగతి విద్యార్థిపై.. నలుగురు సీనియర్ విద్యార్థులు దారుణంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా అతడి మర్మాంగాన్ని దారంతో కట్టారు. దిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. కిద్వాయ్ నగర్ ఈస్ట్‌లోని అటల్ ఆదర్శ్ విద్యాలయంలో బాధిత బాలుడు మూడో తరగతి చదువుతున్నాడు. అతడికి ఎనిమిదేళ్లు. ఈ నెల 24న బాలుడు పాఠశాలకు వెళ్లాడు. అనంతరం టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో 16 సంవత్సరాల వయసు ఉన్న నలుగురు సీనియర్ విద్యార్థులు బాధితుడిపై దాడి చేశారు. అనంతరం అతడి మర్మాంగాన్ని దారంతో కట్టారు. దారాన్ని అలాగే ఉంచుకోవాలని హెచ్చరించారు. విషయం ఎవరికైనా చెబితే తల్లిదండ్రులను చంపేస్తామని బెదిరించారు. దీంతో భయపడ్డ బాలుడు విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. నొప్పిని భరించలేక.. రెండు రోజులు పాఠశాలకు వెళ్లలేదు. బుధవారం సాయత్రం కుమారుడు స్నానం చేస్తుండగా.. మర్మాంగం దారంతో కట్టి ఉండటాన్ని బాలుడి తండ్రి గమనించడంతో విషయం బయటపడింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Nitin Gadkari : ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ మాదే కానీ..: గడ్కరీ
-
BJP: తెలంగాణకు రెండో వారంలో అమిత్‌షా.. 6న నడ్డా
-
World Culture Festival: శాంతి, సామరస్య ప్రపంచం కోసం అందరం కలిసి కృషి చేయాలి!
-
Sudheer Babu: భూతద్దంతో ఈ సినిమాని చూడొద్దు: సుధీర్ బాబు విజ్ఞప్తి
-
Delhi: ఆ ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులూ ఇంజినీర్లే.. బాంబుల తయారీలో నిష్ణాతులు