లోయలో పడిన బస్సు.. 10 మంది మాతా వైష్ణోదేవి భక్తుల మృతి

జమ్మూ-కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాతా వైష్ణోదేవి భక్తులతో వెళ్తోన్న బస్సు లోయలో పడి 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

Published : 31 May 2023 04:58 IST

జమ్మూ-కశ్మీర్‌లో దుర్ఘటన

జమ్ము: జమ్మూ-కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాతా వైష్ణోదేవి భక్తులతో వెళ్తోన్న బస్సు లోయలో పడి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 66 మంది గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌ నుంచి మాతా వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకునేందుకు కొంతమంది బస్సులో బయల్దేరారు. ఆలయ బేస్‌ క్యాంప్‌ అయిన కాట్రాకు వెళ్తుండగా.. ఝజ్జర్‌ కొట్లి ప్రాంతంలో జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై బస్సు అదుపుతప్పింది. రోడ్డుపై నుంచి జారి లోయలో పడింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 75 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 10 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. 66 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను జమ్ములోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని