Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు.. ఈడీ అదుపులో మరో ఇద్దరు

తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో డ్రగ్స్‌ సరఫరాదారుడు కెల్విన్‌ను

Updated : 10 Sep 2021 21:56 IST

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో డ్రగ్స్‌ సరఫరాదారుడు కెల్విన్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నారు. కెల్విన్‌ బ్యాంకు ఖాతా వివరాలను ఈడీ అధికారులు సేకరించారు. కెల్విన్‌తో పాటు పాతబస్తీకి చెందిన వాహిద్‌, కుదూస్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నిందితులు, నటుడు నందు మధ్య లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. కెల్విన్‌ను అదుపులోకి తీసుకొనే ముందు నటుడు నందును 4 గంటల పాటు ప్రశ్నించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని