logo

నాలుగేళ్లు నిద్ర.. పది రోజుల్లో పరుగులు

మన్యంలో నిర్మిస్తున్న సిమెంట్‌ రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. నాలుగేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం హడావుడిగా నిర్మాణాలు ప్రారంభించి పది రోజుల్లో పూర్తిచేస్తున్న వైనం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.

Published : 29 Mar 2024 02:55 IST

నిర్మాణాల్లో కానరాని నాణ్యత

 గంగవరం, న్యూస్‌టుడే:  మన్యంలో నిర్మిస్తున్న సిమెంట్‌ రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. నాలుగేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం హడావుడిగా నిర్మాణాలు ప్రారంభించి పది రోజుల్లో పూర్తిచేస్తున్న వైనం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.

 గంగవరంలో ఇటీవల నాసిరకం ఇసుక వినియోగిస్తూ సీసీ రోడ్డు నిర్మాణాలు పూర్తిచేశారు. పది రోజులుగా గంగవరం, పాతగంగవరంలోనూ ఇలానే సరైన రీతిలో గ్రావెల్‌ వేయకుండా సీసీ రోడ్డు పూర్తి చేశారు. పనులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదారులు ఇష్టానుసారంగా చేపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక వాగుల్లో లభ్యమయ్యే నాసిరకం ఇసుక, సిమెంట్‌తో నిర్మాణాలు పూర్తిచేశారని మాజీ ఎంపీపీ డాక్టర్‌ తీగల ప్రభ ఆరోపించారు. సరిగ్గా వాటరింగ్‌ చేయకపోయినా సంబంధిత అధికారులకు కనిపించడం లేదా అని ఆమె నిలదీశారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే కోడ్‌ వచ్చాక హడావుడిగా పనులు చేస్తున్నారన్నారు. పాతగంగవరంలో సీసీ రోడ్డు నిర్మించి పది రోజులు గడుస్తున్నా కనీసం వాటరింగ్‌ చేయలేదని స్థానికురాలు కొమారి విజయలక్ష్మి అన్నారు. అధికారులు కనీసం పర్యవేక్షించకపోవడం దారుణమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని