logo

పవర్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ కైవసం

పట్టణానికి చెందిన విద్యార్థులు పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో ప్రతిభ చూపారు. ఇటీవల జేఎన్‌టీయూ విజయనగరంలో జరిగిన పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలో కళాశాల్లో ఇంజినీరింగ్‌ చదువుతున్న లలితేశ్వరరావు...

Published : 17 Apr 2024 02:02 IST

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: పట్టణానికి చెందిన విద్యార్థులు పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో ప్రతిభ చూపారు. ఇటీవల జేఎన్‌టీయూ విజయనగరంలో జరిగిన పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలో కళాశాల్లో ఇంజినీరింగ్‌ చదువుతున్న లలితేశ్వరరావు బంగారం, ఎ.వినయ్‌కుమార్‌ ఎం.సాయియశ్వంత్‌ వెండి,  బి.వినయ్‌కుమార్‌లకు కాంస్య పతాకాలు లభించాయి. ప్రతిభ చూపిన విద్యార్థులను మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో డైట్‌ కళాశాల ఛైర్మన్‌ దాడి రత్నాకర్‌, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వైకుంఠరావు అభినందించారు.

రోలుగుంట, న్యూస్‌టుడే: విశాఖలో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో రోలుగుంట జడ్పీ పాఠశాలకు చెందిన ఆంగ్ల ఉపాధ్యాయిని నాగజ్యోతి ఛాంపియన్‌షిప్‌ కైవసం చేసుకున్నారు. ఇంటర్నేషనల్‌ పవర్‌ లిఫ్టర్‌ సీహెచ్‌ అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్రారంభించారు. సీనియర్స్‌, మాస్టర్స్‌ డెడ్‌లిప్ట్‌ రెండు విభాగాల్లో నాగజ్యోతి ప్రథమ స్థానాల్లో నిలిచి బంగారు పతకాలతో ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌గా నిలిచారు. ఇంటర్నేషనల్‌ పవర్‌లిఫ్టర్‌ భాస్కర్‌, లక్ష్మి రిఫరీలుగా వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని