logo

నామినేషన్ల స్వీకరణ రేపటి నుంచి

ఎన్నికల నోటిఫికేషన్‌ ఈనెల 18న జారీ అవుతుందని, ఆ రోజు నుంచి 24వ తేదీ వరకు సెలవు రోజులు మినహా నామినేషన్లు స్వీకరించనున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్‌, పాడేరు రిటర్నింగ్‌ అధికారి భావన తెలిపారు.

Published : 17 Apr 2024 02:23 IST

పాడేరు, న్యూస్‌టుడే: ఎన్నికల నోటిఫికేషన్‌ ఈనెల 18న జారీ అవుతుందని, ఆ రోజు నుంచి 24వ తేదీ వరకు సెలవు రోజులు మినహా నామినేషన్లు స్వీకరించనున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్‌, పాడేరు రిటర్నింగ్‌ అధికారి భావన తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తామన్నారు. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుందన్నారు. 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు ఉపసంహరించుకోవచ్చని సూచించారు. అభ్యర్థులు నామినేషన్లు సమర్పించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓటరు స్లిప్పుల పంపిణీ, కౌంటింగ్‌ విధానంపై అవగాహన కల్పించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, పాడేరు ఏఆర్‌ఓ, తహసీల్దార్‌ కళ్యాణ్‌చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని