icon icon icon
icon icon icon

Andhra news: పోలింగ్‌కు ముందు ఓట్ల కొనుగోలుకు వైకాపా కుట్ర: విజయ్‌ కుమార్‌

ప్రజల డబ్బుతో వారి ఓట్ల కొనుగోలుకు వైకాపా ప్రభుత్వం కుట్రపన్నిందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌ కుమార్‌ ధ్వజమెత్తారు.

Published : 09 May 2024 16:12 IST

విజయవాడ: పోలింగ్‌కు ఒకటి రెండ్రోజుల ముందు లబ్ధిదారుల అకౌంట్లలో నగదు బదిలీ చేసి ప్రజల డబ్బుతో వారి ఓట్లను కొనుగోలు చేసేందుకు వైకాపా ప్రభుత్వం కుట్రపన్నిందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌ కుమార్‌ ధ్వజమెత్తారు. ఎన్నికల కోడ్‌ రాకముందే వివిధ పథకాల నిధులు పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్నాయని ఈసీ .. సీఎస్‌కు ఇచ్చిన తాజా నివేదిక ద్వారా బట్టబయలైందన్నారు. నాలుగు నెలల నుంచి నిధులు ఎందుకు ఖజానాలోనే ఉంచారన్న ఈసీ ప్రశ్నలకు సీఎస్‌ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. వివిధ పథకాలకు సంబంధించిన రూ.14వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జనవరిలోనే ఆయా శాఖల ఖాతాల్లో జమ చేసిందని మండిపడ్డారు.

నాలుగు నెలల పాటు రూ.14వేల కోట్లు ఎక్కడ పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జనవరిలో రూ.13వేల కోట్ల పైచిలుకు రెవెన్యూ ఖర్చు ఎందుకొచ్చిందని ఇప్పటికే తెలుగుదేశం నిలదీసిన విషయాన్ని గుర్తు చేశారు. బాండ్ల ద్వారా ఏపీఎండీసీ సేకరించిన రూ.7వేల కోట్లు ఖజానాకు జమచేసుకుని, వాటిని వివిధ పథకాల కోసం శాఖలకు మళ్లించారని దుయ్యబట్టారు. ఏప్రిల్‌ నెలలో అవ్వాతాతలకు పింఛన్‌ ఇచ్చేందుకు కూడా డబ్బులు లేవని బొంకారని ఆరోపించారు. సీఎస్‌కు తెలియకుండానే రూ.14వేల కోట్లు వివిధ శాఖల్లో నాలుగు నెలలుగా మగ్గుతున్నాయా? అని ప్రశ్నించారు. ఆయా శాఖల కార్యదర్శులు లబ్ధిదారులకు బదిలీ చేయకుండా ఎందుకు ఖజానాలోనే నాలుగు నెలలు ఉంచారని నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img