logo

ఆగని ఇసుక రవాణా

పెద్దపప్పూరులోని అక్రమ ఇసుక రీచ్‌పై పత్రికల్లో పలు కథనాలు వచ్చినా.. అధికారుల అలసత్వంతో అక్రమార్కులు మరింత పేట్రేగిపోతున్నారు.

Published : 07 Dec 2022 04:15 IST

కొనసాగుతున్న తవ్వకాలు

పెద్దపప్పూరు, న్యూస్‌టుడే: పెద్దపప్పూరులోని అక్రమ ఇసుక రీచ్‌పై పత్రికల్లో పలు కథనాలు వచ్చినా.. అధికారుల అలసత్వంతో అక్రమార్కులు మరింత పేట్రేగిపోతున్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలను అడ్డుపెట్టుకొని సంబంధిత అధికారులు మరింత చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. పది రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా మండలకేంద్రం పెద్దపప్పూరులో అనధికార ఇసుక రీచ్‌ను వైకాపా నాయకులు నిర్వహిస్తున్నారు. దీన్ని అరికట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. జనావాసాల మధ్య మండల కేంద్రమైన పెద్దపప్పూరుకు సమీపంలో ఇసుక రీచ్‌ను నిర్వహిస్తున్నా సంబంధిత అధికారుల చోద్యం చూస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పోలీసుస్టేషన్‌, జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బీసీ బాలుర వసతి గృహం, మౌర్య, శ్రీసాయిరాం ఉన్నత పాఠశాలలు ఉన్న ప్రధాన రహదారిపై నిత్యం వందలాది ట్రిప్పుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇటీవల చిన్నపప్పూరులోని అశ్వర్థ ఆలయ సమీపంలో పెన్నానదిలో గుంతలో పడి తాడిపత్రికి చెందిన యువకుడు నీటిలో మునిగి మృతిచెందాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇసుక అక్రమంగా తరలిపోకుండా చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలవాలని కోరుతున్నారు. దీనిపై భూగర్భ గనులశాఖ ఏడీని చరవాణిలో ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా ఆయన స్పందించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని