logo

‘మహిళా ఉద్యోగులను వేధిస్తే తోలు తీస్తాం’

‘పై అధికారులను గౌరవిస్తాం. వారు చెప్పిన పనిచేస్తాం. అధికారుల ముసుగులో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని వేధిస్తే తోలు తీస్తాం’ అని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భీమిరెడ్డి అంజన్‌రెడ్డి హెచ్చరించారు.

Published : 06 Feb 2023 03:44 IST

మాట్లాడుతున్న సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజన్‌రెడ్డి

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: ‘పై అధికారులను గౌరవిస్తాం. వారు చెప్పిన పనిచేస్తాం. అధికారుల ముసుగులో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని వేధిస్తే తోలు తీస్తాం’ అని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భీమిరెడ్డి అంజన్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం అనంతపురంలోని పీవీకేకే కళాశాల సెమినార్‌ హాల్లో రైతుభరోసా కేంద్రాల సిబ్బంది సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రంలో ఒకే ఒక ఉద్యోగిని నియమించడంతో ఇబ్బందిగా ఉందని, ఒకే ఒక ఉద్యోగి ఇన్ని పనులు చేయడం ఏ రాష్ట్రంలో ఉండదన్నారు. రైతు భరోసా కేంద్ర వ్యవస్థలో పనిచేసే వారి సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. కనీసం మరో ఇద్దరిని నియమించాలని డిమాండు చేశారు. మరోసారి రైతు భరోసా కేంద్రాల సిబ్బంది పట్ల అనుచితంగా వ్యవహరిస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. సమావేశంలో సచివాలయ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వీరనారాయణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు లావణ్య, శ్రీనివాస్‌, నరేష్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని