logo

అనంతపురంలో సీఎం జగన్‌ బస్సు యాత్ర తుస్సు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బస్సుయాత్ర కోసం అనంత నగరంలో వైకాపా శ్రేణులు ఐదు గంటలకుపైగానే నిరీక్షించారు.

Updated : 31 Mar 2024 10:07 IST

అనంతపురం జిల్లా సరిహద్దులో బస్సుయాత్రకు స్వాగతం పలికేందుకు నాయకులు లేకపోవడంతో వెలవెల

అనంతనగరపాలక, రాప్తాడు, గుత్తి, గుత్తి గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బస్సుయాత్ర కోసం అనంత నగరంలో వైకాపా శ్రేణులు ఐదు గంటలకుపైగానే నిరీక్షించారు. అయితే సీఎం కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది. జగన్‌ బస్సు యాత్ర శనివారం సాయంత్రం 5గంటలకే ప్రారంభం అవుతుందని వైకాపా నేతలు ముందస్తుగా సమాచారం అందించారు. అనంతపురంలోని 50 డివిజన్లతోపాటు గ్రామీణ మండలాల్లోని నారాయణపురం, రాజీవ్‌కాలనీ, రుద్రంపేట, అనంతపురం గ్రామీణం మండలాల నుంచి వైకాపా నాయకులు తపోవనం కూడలికి చేరుకున్నారు. సాయంత్రం 5 గంటలకు జగన్‌ వస్తారని చెప్పినా అప్పటి దాకా ఆ ప్రాంతానికి వైకాపా నాయకులెవ్వరూ రాలేదు. 6.30గంటలకు ఒక్కొక్కరుగా ఆయా డివిజన్ల నుంచి ముఖ్య నేతలు, అనుచరులతో కలిసి వచ్చారు. నగరంలోని చాలా ప్రాంతాల నుంచి ఎవరూ హాజరు కాలేదు. స్పందన అంతంత మాత్రంగానే ఉంది. జగన్‌ రాత్రి 9.33 గంటలకు తపోవనం కూడలికి చేరుకున్నారు. ఆయనకు ఎదురుగా వెళ్లినవారే మళ్లీ కూడలికి వద్దకు వచ్చారు. 10 నిమిషాలపాటు బస్సుపై నుంచే సీఎం అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు.

ఆగిన అంబులెన్స్‌..

గుత్తిలో బస్సు యాత్రలో చిక్కుకున్న అంబులెన్స్‌

గుత్తిలో బస్సు యాత్ర జరుగుతున్న సమయంలో అంబులెన్స్‌ వచ్చింది. ముందుకు వెళ్లే దారి లేకపోవడంతో రెండు నిమిషాలు ఆగిపోయింది. పోలీసులు వెంటనే స్పందించి అంబులెన్స్‌కు దారి చూపడంతో వెళ్లిపోయింది.

శనివారం రాత్రి 11.30గంటలకు రాప్తాడు మండలం ఇటుకలపల్లిలో బస్సులో జగన్‌.. చుట్టూ కార్యకర్తలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు