logo

జనవరిలో బటన్‌ నొక్కినా..జమకాని ఆసరా నిధులు

 ప్రభుత్వం డ్వాక్రా సంఘాల సభ్యులకు అందిస్తున్న నాలుగో విడత ఆసరా పథకం నగదు ఇంతవరకూ తమ ఖాతాలకు జమ కాలేదని డ్వాక్రా సంఘాల మహిళలు మంగళవారం వెలుగు కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు

Published : 17 Apr 2024 05:34 IST

వెలుగు కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న డ్వాక్రా సంఘాల మహిళలు

 రామగిరి, న్యూస్‌టుడే : ప్రభుత్వం డ్వాక్రా సంఘాల సభ్యులకు అందిస్తున్న నాలుగో విడత ఆసరా పథకం నగదు ఇంతవరకూ తమ ఖాతాలకు జమ కాలేదని డ్వాక్రా సంఘాల మహిళలు మంగళవారం వెలుగు కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సీఎం జనవరిలో బటన్‌ నొక్కి  ఖాతాలకు డబ్బులు వేస్తున్నట్లు చెప్పారని, మండల వ్యాప్తంగా 2,300 మందికి ఎందుకు జమ కాలేదని అధికారులను నిలదీశారు. మూడు నెలలు కావస్తున్నా ఇంతవరకూ ఆసరా నగదు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు డబ్బుల కోసం బ్యాంకుల చుట్ట్టూ ప్రదక్షిణ చేస్తున్నారని, ఎప్పుడు జమ చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికే కొంతమంది మహిళలకు నగదు జమైందని, ఓసీ కార్పొరేషన్‌ ద్వారా జమ కావాల్సిన నగదు అందలేదని అధికారులు తెలిపారు. దీంతో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో నగదు ఇవ్వనప్పుడు ఎందుకు బటన్‌ నొక్కాలంటూ నిరాశతో వెనుదిరిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని