logo

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పునరుద్ధరణకు చర్యలు

కాకినాడ ఆకర్షణీయ నగరంలోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(ఐసీసీసీ) పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌, స్మార్ట్‌సిటీ ఛైర్‌పర్సన్‌ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు.

Published : 26 Mar 2023 03:23 IST

కాకినాడ కలెక్టరేట్‌: కాకినాడ ఆకర్షణీయ నగరంలోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(ఐసీసీసీ) పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌, స్మార్ట్‌సిటీ ఛైర్‌పర్సన్‌ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో కాకినాడ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ బోర్డు 37వ సమావేశాన్ని డైరెక్టర్లతో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఐసీసీసీ కార్యకలాపాలను పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు అవసరమైన ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీసీ కెమెరాల నిఘా వ్యవస్థ, పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్‌ సిస్టంను మనుగడలోకి తెచ్చేందుకు అవసరమైన అంశాలను నివేదికలో పొందుపర్చాలన్నారు. దీనికి అయిదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. స్మార్ట్‌సిటీ మిషన్‌ కింద చేపట్టిన సైన్స్‌ సెంటర్‌, కళాక్షేత్రం, కన్వర్టబుల్‌ స్టేడియం, స్కేటింగ్‌ రింగ్‌ పనులపై సమీక్షించారు. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి, వినియోగంలోకి తేవాలన్నారు. దీనికి అవసరమైన నిధులు, ఇతర అంశాలపై చర్చించారు. సమావేశంలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌, స్మార్ట్‌సిటీ సీఈవో, ఎండీ కె.రమేశ్‌ డైరెక్టర్లు టీవీఎస్‌ కృష్ణకుమార్‌, జేవీఆర్‌ మూర్తి, సందీప్‌ కుల్హారియా తదితరులు పాల్గొన్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని