logo

Crime News: పెళ్లి పేరుతో 3 నెలల్లో.. 300 మోసాలు!

పెళ్లి పేరుతో మూడు నెలల్లో.. దాదాపు 300 మోసాలకు పాల్పడిన ఓ మ్యాట్రిమోని సంస్థకు చెందిన ఇద్దరు నిందితులను శంకర్‌పల్లి పోలీసులు శనివారం రిమాండ్‌ తరలించారు. శంకర్‌పల్లి సీఐ మహేష్‌ వివరాల ప్రకారం..

Updated : 19 Dec 2021 09:43 IST
రూ.9.8 లక్షలు వసూలు
ఇద్దరు నిందితులకు రిమాండ్‌

హేమంత్‌, శ్వేత

శంకర్‌పల్లి మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: పెళ్లి పేరుతో మూడు నెలల్లో.. దాదాపు 300 మోసాలకు పాల్పడిన ఓ మ్యాట్రిమోని సంస్థకు చెందిన ఇద్దరు నిందితులను శంకర్‌పల్లి పోలీసులు శనివారం రిమాండ్‌ తరలించారు. శంకర్‌పల్లి సీఐ మహేష్‌ వివరాల ప్రకారం.. నాగ్‌పూర్‌ కేంద్రంగా రిటా(30) తెలంగాణలో ఆరు(వరంగల్‌ 1, ఆదిలాబాద్‌ 3, నిజామాబాద్‌ 1) మ్యాట్రిమోని కేంద్రాలను నడిపిస్తున్నారు. మూడు నెలల క్రితం శంకర్‌పల్లికి చెందిన వ్యక్తికి ఫోన్‌ చేయగా స్పందించి రూ.3 వేలతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడు. ఆ సంస్థ నుంచి మళ్లీ ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. స్థానిక పోలీసులు, సైబర్‌ క్రైం సిబ్బంది సాయంతో ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లలోని మ్యాట్రిమోనీ శాఖలపై దాడులు చేశారు. మేనేజర్లు శ్వేత(20), హేమంత్‌(27)ను అదుపులోకి తీసుకొని విచారించారు. 3 నెలల్లో దాదాపు 300 మందిని మోసగించిరూ.9.8లక్షలు వసూలు చేశామని ఒప్పుకొన్నారు. వసూలైన డబ్బు నాగ్‌పూర్‌ కేంద్రానికి చేరుతుందని, తాము కేవలం ఉద్యోగులమని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని