logo

గాంధీధామ్‌కు రైళ్లు నడపాలి

నగరం నుంచి గుజరాత్‌ కచ్‌లోని గాంధీధామ్‌, భుజ్‌ నగరాలకు రైళ్లను నడపాలని తెలంగాణ, ఏపీ, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ గుజరాతీ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. నగరం నుంచి నేరుగా రైళ్లు లేకపోవడం వల్ల అహ్మదాబాద్‌, ముంబయి వెళ్లి..

Published : 28 May 2022 01:23 IST


కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన గుజరాతీ సంఘాల ప్రతినిధులు రితీశ్‌ జాగిర్దార్‌, దినేశ్‌గోసర్‌, వైశాలిషా

కాచిగూడ, న్యూస్‌టుడే: నగరం నుంచి గుజరాత్‌ కచ్‌లోని గాంధీధామ్‌, భుజ్‌ నగరాలకు రైళ్లను నడపాలని తెలంగాణ, ఏపీ, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ గుజరాతీ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. నగరం నుంచి నేరుగా రైళ్లు లేకపోవడం వల్ల అహ్మదాబాద్‌, ముంబయి వెళ్లి.. అక్కడి నుంచి బయలుదేరాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాయి. శుక్రవారం తెలంగాణ గుజరాతీ జైన్‌ సమాజ్‌ కన్వీనర్‌ రితీశ్‌ జాగిర్దార్‌, తెలంగాణ, ఏపీ కచ్‌ పాటీదార్‌ సమాజ్‌ అధ్యక్షుడు కాంతీలాల్‌పటేల్‌, కచ్‌లేవా పాటీదార్‌ సమాజ్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు ధంజీభాయ్‌పటేల్‌, శ్రీకచ్‌ మిత్ర మండల్‌ ప్రతినిధి దినేశ్‌గోసర్‌, శ్రీకచ్‌ కడ్‌వా పాటీదార్‌ సమాజ్‌ హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ కన్వీనర్‌ వైశాలిషా తదితరులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కాచిగూడలోని నివాసంలో కలిశారు. నగరంలోని రెండు లక్షల మంది గుజరాతీయులతోపాటు, మాండ్వ పోర్ట్‌లో పనిచేసే నగరానికి చెందిన వేలాది మందికి ఈ రైలుతో ప్రయోజనం కలుగుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని