logo

విధుల్లోకి తీసుకోవట్లేదని.. ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య

అధికారులు విధుల్లోకి తీసుకోవట్లేదని మనస్తాపానికి గురైన టీఎస్‌ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట గ్రామీణ మండలం సీతారాంపల్లిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 27 Jun 2022 02:40 IST

సిద్దిపేట అర్బన్‌, న్యూస్‌టుడే: అధికారులు విధుల్లోకి తీసుకోవట్లేదని మనస్తాపానికి గురైన టీఎస్‌ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట గ్రామీణ మండలం సీతారాంపల్లిలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై కిరణ్‌ వివరాల ప్రకారం.. సీతారాంపల్లికి చెందిన పడిగె స్వామి(45) రాణిగంజ్‌ డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పదేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. కంటికి దెబ్బ తగలడంతో ఆరోగ్య పరీక్షలో విఫలమయ్యాడు. అధికారులు ఆయన్ను ఏడాదిగా విధుల్లోకి తీసుకోవడంలేదు. సిక్‌ లీవ్‌లో ఉన్నాడు. పలుమార్లు అధికారులను కలిశాడు. జూన్‌ 24న మరోసారి అభ్యర్థించాడు. కంటి చూపు సరిగా లేనందున విధులు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. ఇటీవల కుమార్తె వివాహం చేశాడు. అప్పులు వెంటాడుతున్నాయి. ఆవేదనకు గురై గ్రామ శివారులో ఆదివారం చెట్టుకు ఉరేసుకున్నాడు. అతడికి భార్య భూదేవి, కుమారుడు రాకేశ్‌ ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని