logo

ప్రైవేటు ఆసుపత్రుల్లో జర్నలిస్టులకు వైద్యమందేలా చర్యలు

ప్రైవేటు ఆసుపత్రుల్లో జర్నలిస్టులు, వారి కుటుంబాలకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Published : 06 Jul 2022 02:11 IST

మంత్రి హరీశ్‌రావు


మంత్రి హరీశ్‌రావుకు వినతి పత్రాన్ని అందిస్తున్న ప్రతినిధులు

సికింద్రాబాద్‌, న్యూస్‌టుడే: ప్రైవేటు ఆసుపత్రుల్లో జర్నలిస్టులు, వారి కుటుంబాలకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. హెచ్‌యూజే అధ్యక్ష, కార్యదర్శులు ఇ.చంద్రశేఖర్‌, నిరంజన్‌ ఆధ్వర్యంలో జర్నలిస్టుల బృందం మంత్రి హరీశ్‌రావును మంగళవారం కలిసింది. జర్నలిస్టు హెల్త్‌ స్కీమ్‌ ప్రైవేటు ఆసుపత్రుల్లో అమలు కావడంలేదని, వైద్యం చేయడానికి నిరాకరిస్తున్నారని వారు తెలిపారు. జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారని వినతిపత్రం అందజేశారు. మంత్రి స్పందిస్తూ.. నెట్‌వర్క్‌ ఆసుపత్రులతో త్వరలో సమావేశం నిర్వహించి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రిని కలిసిన వారిలో హెచ్‌యూజే నాయకులు పద్మరాజు, రాజశేఖర్‌, అరుణ్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని