logo

రక్తనిధి కేంద్రంపై కేసు

తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారి రక్తంలో హెచ్‌ఐవీ ఉందని తేలిన ఘటనలో రక్తనిధి కేంద్రంపై కేసు నమోదైన సంఘటన నల్లకుంట పోలీస్‌ స్టేషన్‌లో చోటుచేసుకుంది. సీఐ మొగిలిచర్ల రవి తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లాకు చెందిన

Published : 09 Aug 2022 03:18 IST

నల్లకుంట, న్యూస్‌టుడే: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారి రక్తంలో హెచ్‌ఐవీ ఉందని తేలిన ఘటనలో రక్తనిధి కేంద్రంపై కేసు నమోదైన సంఘటన నల్లకుంట పోలీస్‌ స్టేషన్‌లో చోటుచేసుకుంది. సీఐ మొగిలిచర్ల రవి తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లాకు చెందిన మూడేళ్ల బాలుడు తలసేమియాతో బాధపడుతున్నాడు. రెండున్నరేళ్లుగా విద్యానగర్‌లోని రెడ్‌ క్రాస్‌ రక్తనిధి కేంద్రంలో 15 రోజులకోసారి బాలునికి రక్తం ఎక్కిస్తున్నారు. జులై 20న రక్తం ఎక్కించడానికి వెళ్లినప్పుడు పరీక్షించిన వైద్యులు చిన్నారి రక్తంలో హెచ్‌ఐవీ ఉన్నట్లు నిర్ధారించారు. బాలుని తండ్రి జులై 30న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైద్యాధికారుల సూచనలు, సలహాలు తీసుకొని సోమవారం ఆ రక్తనిధి కేంద్రంపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని