logo

వైభవంగా సహస్ర చండీయాగం

తెరాస రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తన స్వగ్రామం ఎల్మినేడులోని వ్యవసాయ క్షేత్రంలో 5 రోజులపాటు తలపెట్టిన సహస్ర చండీయాగం గురువారం రుత్వికుల వేదమంత్రోచ్చారణల మధ్య వైభవంగా ప్రారంభమైంది.

Published : 19 Aug 2022 02:06 IST

ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి దంపతుల దీక్షాధారణ

గోమాతను అర్చిస్తున్న ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు

ఇబ్రహీంపట్నం,న్యూస్‌టుడే: తెరాస రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తన స్వగ్రామం ఎల్మినేడులోని వ్యవసాయ క్షేత్రంలో 5 రోజులపాటు తలపెట్టిన సహస్ర చండీయాగం గురువారం రుత్వికుల వేదమంత్రోచ్చారణల మధ్య వైభవంగా ప్రారంభమైంది. యాగాచార్యులు వెల్లంకి ప్రసాదశర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాగంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు దీక్షాధారణ చేశారు. భక్తులు, భజనమండలి సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు, ఆర్డీఓ వెంకటాచారి, ఎంపీపీ కృపేష్, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ స్రవంతి, వైస్‌ ఛైర్మన్‌ ఎ.యాదగిరి, వైఎస్‌ ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి, రై.స.స జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని