logo

హెచ్‌సీయూలో కేంద్రీయ విద్యాలయం ఎత్తివేత

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నడుస్తున్న కేంద్రీయ విద్యాలయాన్ని ఎత్తివేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (కేవీఎస్‌)తో

Published : 28 Sep 2022 02:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నడుస్తున్న కేంద్రీయ విద్యాలయాన్ని ఎత్తివేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (కేవీఎస్‌)తో ఒప్పందాన్ని పునరుద్ధరించకూడదని హెచ్‌సీయూ తీర్మానించింది. 2013లో కేవీఎస్‌తో కుదిరిన ఒప్పందం మేరకు హెచ్‌సీయూలో క్యాంపస్‌ స్కూల్‌ను కేంద్రీయ విద్యాలయంగా మార్చారు. దీనికి సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు ఉంది. ప్రస్తుతం 320 మంది విద్యార్థులు చదువుతుండగా.. 18 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అప్పట్లో కేవీఎస్‌తో పదేళ్లకు ఒప్పందం కుదిరింది. దీని నిర్వహణ బాధ్యతలు వర్సిటీనే చూస్తోంది. ఈ నేపథ్యంలో వర్సిటీపై ఏటా రూ.1.5-2 కోట్ల వరకు భారం పడుతున్నట్లు తెలిసింది. కేవీఎస్‌తో ఉన్న ఒప్పందం వచ్చే ఏడాది మార్చి 31తో మారనుంది. ఈ నేపథ్యంలో ఒప్పందాన్ని పొడిగించకుండా నిలిపివేయాలని హెచ్‌సీయూ పాలకవర్గం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అనంతరం క్యాంపస్‌ స్కూల్‌గా కొనసాగించనున్నారు. ప్రస్తుతం 7, 8, 9 తరగతులలో విద్యార్థులు క్యాంపస్‌ స్కూల్‌ విద్యార్థులుగా చదువు కొనసాగించే వీలుంటుంది. ఇప్పటికే ఒకటి నుంచి ఆరో తరగతి వరకు క్యాంపస్‌ పాఠశాల విద్యార్థులుగానే చదువుకుంటున్నారు. పూర్తిస్థాయిలో క్యాంపస్‌ స్కూల్‌గా మార్చిన తర్వాత హెచ్‌సీయూ ఏ మేరకు పట్టించుకుంటుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని