logo

ఆరుతడి... అన్నదాతకు రాబడి

వరిని తగ్గించి ప్రత్యామ్నాయ పంటలను (ఆరుతడి) సాగు చేస్తేనే మేలని  ్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో రైతులను ఆ దిశగా సమాయత్తం చేసేందుకు వ్యవసాయశాఖ అవగాహన సదస్సులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం

Published : 30 Sep 2022 03:12 IST

యాసంగి సాగుపై అధికారుల అవగాహన

న్యూస్‌టుడే, వికారాబాద్‌ : వరిని తగ్గించి ప్రత్యామ్నాయ పంటలను (ఆరుతడి) సాగు చేస్తేనే మేలని  ్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో రైతులను ఆ దిశగా సమాయత్తం చేసేందుకు వ్యవసాయశాఖ అవగాహన సదస్సులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం వద్ద పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు నిల్వ ఉండటంతో బియ్యం సేకరణపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో వరికి బదులు ఇతర పంటలను సాగు చేయాలంటూ ముమ్మర ప్రచారాన్ని మొదలుపెట్టింది.

ముందస్తుగానే చర్యలు...

సాధారణంగా యాసంగిలో సాగు చేసే వరి ధాన్యాన్ని అధికంగా బాయిల్డ్‌ బియ్యంగా మారుస్తూ ఉంటారు. భారత ఆహార సంస్థ వద్ద పెద్ద ఎత్తున బాయిల్డ్‌ రైస్‌ నిల్వలు ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి ఉండదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం రైతుల దృష్టిని వాణిజ్య పంటల వైపు మళ్లించేందుకు యత్నిస్తోంది.  యాసంగిలోనూ ఆరుతడి విస్తీర్ణం పెంచాలన్న దిశగా ముందుకు సాగుతోంది.

పదేళ్ల క్రితం ఎలాంటివి వేశారో...

పదేళ్ల క్రితం ఏయే ప్రాంతాల్లో ఏయే రకం పంటలను సాగుచేశారో, అవే పంటలను ఈ యాసంగిలో సాగు చేస్తే రైతులకు మేలు కలుగుతుందని చెబుతున్నారు. వాస్తవానికి జిల్లాలో పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, వంట నూనె ఉత్పత్తుల పంటల సాగు విస్తీర్ణం పెరœగడం లేదు. కూరగాయల సాగు కూడా పెరగడం లేదు. గతంలో జిల్లాలో అత్యధికంగా వేరుసెనగతో పాటు జొన్న, మొక్కజొన్న, పెసర, బెబ్బర, కంది, శనగ, మినుము, పంటలను రైతులు సాగు చేసేవారు. కాలక్రమేణా సాగునీటి వసతి పెరగడంతో పాటు అడవి పందులు, కోతుల బెడద వల్ల వరి, పత్తి పంటల వైపే మొగ్గు చూపారు.  

ప్రత్యామ్నాయ పంటలే మేలు.. - గోపాల్‌, జిల్లా వ్యవసాయాధికారి

యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయంగా కుసుమ, పొద్దు తిరుగుడు, సెనగ, వేరుసెనగ, జొన్న, తదితర పప్పు దినుసుల పంటలను సాగు చేయాలని  అవగాహన కల్పిస్తున్నాం. ఆరుతడి పంటలకు పెట్టుబడి తగ్గడంతో పాటు అధిక లాభాలుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని