logo

మాజీ సీఐ నాగేశ్వరరావు విడుదల

మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావుపై జులైలో వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచడంతో చర్లపల్లి జైలుకు రిమాండ్‌కు తరలించారు. 81 రోజులుగా రిమాండ్‌లో ఉండగా రెండుసార్లు జిల్లా న్యాయస్థానంలో

Published : 30 Sep 2022 03:12 IST

చర్లపల్లి, న్యూస్‌టుడే: మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావుపై జులైలో వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచడంతో చర్లపల్లి జైలుకు రిమాండ్‌కు తరలించారు. 81 రోజులుగా రిమాండ్‌లో ఉండగా రెండుసార్లు జిల్లా న్యాయస్థానంలో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా తిరస్కరించారు. బుధవారం మాజీ సీఐ నాగేశ్వరరావుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రూ.లక్ష పూచీకత్తును గురువారం రంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో కుటుంబసభ్యులు సమర్పించారు.  చర్లపల్లి కేంద్రకారాగార అధికారులకు సాయంత్రం 4.30గంటల సమయంలో బెయిల్‌ పత్రాలను బంధువులు అందజేయడంతో జైలు నుంచి నాగేశ్వరరావును విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని