logo

ట్రాక్‌ తప్పుతున్న పరీక్ష

రాజధానిలో రవాణా శాఖ జారీ చేసే లైసెన్సుల ప్రక్రియలో కీలకమైన డ్రైవింగ్‌ పరీక్షలు ఆలస్యమవుతున్నాయి. లైసెన్సులు తీసుకునేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం, గ్రేటర్‌లో ఐదుచోట్ల మాత్రమే ట్రాక్‌లు ఉండడంతో

Published : 30 Sep 2022 03:51 IST

కొత్తవాటికి ప్రతిపాదనల్లేవ్‌


ఉప్పల్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌వద్ద లైసెన్స్‌ కోసం వచ్చినవారు

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో రవాణా శాఖ జారీ చేసే లైసెన్సుల ప్రక్రియలో కీలకమైన డ్రైవింగ్‌ పరీక్షలు ఆలస్యమవుతున్నాయి. లైసెన్సులు తీసుకునేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం, గ్రేటర్‌లో ఐదుచోట్ల మాత్రమే ట్రాక్‌లు ఉండడంతో ప్రక్రియలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ఉప్పల్‌, నాగోల్‌, మన్నెగూడ(ఇబ్రహీంపట్నం), కొండాపూర్‌, పేట్‌బషీరాబాద్‌(మేడ్చల్‌ జిల్లా)లలోని డ్రైవింగ్‌ ట్రాక్‌ కేంద్రాల్లో రోజూ వందలాది మంది నిరీక్షిస్తున్నారు. అంతర్జాలం ద్వారా డ్రైవింగ్‌ పరీక్షకు నిర్దేశిత సమయాన్ని ఎంచుకుంటున్నా అక్కడికి వెళ్లేసరికి అంతకన్నా ముందుగా సమయాన్ని ఎంపిక చేసుకున్నవారే ఉంటున్నారు. ఆర్టీఏ ఏజెంట్ల ద్వారా పరీక్షలకు వెళ్తున్నవారికే త్వరగా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీన్ని రవాణా శాఖ కొట్టిపాడేస్తోంది. 3-5ఎకరాల స్థలం, భారీ ఖర్చు అవసరమైన నేపథ్యంలో కొత్త డ్రైవింగ్‌ ట్రాక్‌లు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని చెబుతోంది.

రోజుకు రెండువేల మంది..

డ్రైవింగ్‌ పరీక్షలో అధికారుల సమక్షంలో వాహనాన్ని నడపాలి. గ్రేటర్‌లో రోజుకు దాదాపు 2000 మంది లైసెన్స్‌లకోసం ఆన్‌లైన్‌లో స్లాట్లు బుక్‌ చేసుకుంటున్నారు. రోజూ డ్రైవింగ్‌ ట్రాక్‌ల వద్దకు వందల మంది వెళ్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని