logo

Heavy Rain: జంట నగరాల్లో భారీ వర్షం.. బోరబండలో కొట్టుకుపోయిన వాహనాలు

జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. 

Updated : 13 Oct 2022 01:02 IST

హైదరాబాద్‌: జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్‌, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, దోమలగూడ, కవాడిగూడ, బోలక్‌పూర్‌, రామ్‌నగర్‌, జవహర్‌నగర్‌, గాంధీనగర్‌, కుత్బుల్లాపూర్‌, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, బేగంపేట్‌, ప్యాట్నీ, చిలకలగూడ, అల్వాల్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, సోమాజిగూడ, అమీర్‌పేట్‌, సనత్‌నగర్‌, బోరబండ, రహ్మత్‌నగర్‌, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, ఆల్విన్‌కాలనీ,  కేపీహెచ్‌బీ కాలనీ, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, చంపాపేట్‌, సైదాబాద్‌, సరూర్‌నగర్‌, సంతోష్‌నగర్‌, మూసారాంబాగ్‌, కోఠి, సుల్తాన్‌బజార్‌, అబిడ్స్‌, నాంపల్లి, బషీర్‌బాగ్‌, నారాయణగూడ, లక్డీకపూల్‌, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, పటాన్‌చెరు, మియాపూర్‌,  మాదాపూర్‌, కొండాపూర్‌, కొత్తగూడ, ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ కింద భారీగా వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇరువైపులా కిలో మీటర్‌ మేర వాహనాలు ఆగిపోయాయి. బోరబండలో అపార్ట్‌మెంట్‌ సెల్లార్లలోకి వరద నీరు చేరింది. బోరబండలో వరద ప్రవాహంలో ఆటోలు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. ఇళ్లముందు పార్క్‌ చేసిన వాహనాలు కొట్టుకుపోయేలా వరద వచ్చింది. రహమత్ నగర్, బోరబండలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రసూల్‌పురాలో ఇళ్లలోకి నీరు చేరింది. 

మరోవైపు భారీ వర్షాలతో జంట జలశయాలు నిండుకుండలా మారాయి. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్‌ ఇన్‌ఫ్లో 900 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు 4 గేట్లు ఎత్తి 952 క్యూసెక్కుల ప్రవాహాన్ని మూసిలో విడుదల చేస్తున్నారు. హిమాయత్‌ సాగర్‌కు ఇన్‌ ఫ్లో 1200 క్యూసెక్కులుగా ఉంది. రెండు గేట్లు ఎత్తి 1373 క్యూసెక్కులను మూసిలోకి వదిలారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని