logo

వర్గల్‌ సరస్వతి ఆలయానికి ప్రత్యేక బస్సులు రేపు

వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లాలోని వర్గల్‌ కొండపై ఉన్న మహా సరస్వతి ఆలయానికి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు సికింద్రాబాద్‌ డిప్యూటీ రీజనల్‌ మేనేజర్‌ అపర్ణ కల్యాణి ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 25 Jan 2023 01:46 IST

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లాలోని వర్గల్‌ కొండపై ఉన్న మహా సరస్వతి ఆలయానికి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు సికింద్రాబాద్‌ డిప్యూటీ రీజనల్‌ మేనేజర్‌ అపర్ణ కల్యాణి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 26న ఉదయం 5.15గంటల నుంచి సాయంత్రం 6.15గంటల వరకు 20 నిమిషాలకొక బస్సు చొప్పున సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని గురుద్వారా వద్ద నుంచి నడపనున్నట్లు పేర్కొన్నారు. పెద్దలకు రూ.60, పిల్లలకు రూ.30 ఛార్జీలు ఉంటాయని వివరించారు. వివరాలకు 99595 59547, 98553 14253 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

ఆర్టీసీ ప్రయాణికుల సమాచారార్థం సికింద్రాబాద్‌ రేతిఫైల్‌ బస్‌స్టేషన్‌లో విచారణకేంద్రం ఏర్పాటుచేసినట్లు ఆర్టీసీ సికింద్రాబాద్‌ డిప్యూటీ రీజనల్‌ మేనేజర్‌ అపర్ణ కల్యాణి తెలిపారు. ప్రయాణికులు 99592 26154 ఫోన్‌ నంబరులో సంప్రదించి సలహాలు, ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని