logo

తడి పొడి చెత్తను వేర్వేరుగానే నిల్వ చేయాలి

తడి పొడి చెత్తను వేర్వేరుగానే నిల్వ చేయాలని తాండూరు పురపాలక సంఘం మేనేజరు నరేందర్‌రెడ్డి ప్రజలకు సూచించారు.

Published : 07 Feb 2023 04:06 IST

అవగాహన కల్పిస్తున్న అధికారులు

తాండూరు టౌన్‌: తడి పొడి చెత్తను వేర్వేరుగానే నిల్వ చేయాలని తాండూరు పురపాలక సంఘం మేనేజరు నరేందర్‌రెడ్డి ప్రజలకు సూచించారు. 2023 స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా పట్టణంలోని 6వ వార్డు ఇందిరానగర్‌లో సోమవారం తడి పొడి చెత్త నిల్వ చేయటంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి రోజు ఇళ్లలో వెలువడుతున్న చెత్తను వేర్వేరుగా నిల్వ చేసి మున్సిపల్‌ సిబ్బందికి అందించాలని సూచించారు. తద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. తడి, పొడి చెత్త  నిల్వ చేయటానికి వేర్వేరు డబ్బాలు అందజేశారు. కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ అధికారి ప్రవీణ్‌ కుమార్‌ గౌడ్‌, టీఎంసీ సరిత, వార్డు కౌన్సిలరు బోయ రవిరాజ్‌, సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని