logo

‘ప్రశ్నపత్రాల లీకేజీకి నైతిక బాధ్యత సీఎందే’

టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ విద్యార్థులు మంగళవారం ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నించారు.

Published : 22 Mar 2023 02:10 IST

ఝాన్సీని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

సోమాజిగూడ, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ విద్యార్థులు మంగళవారం ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నించారు. విద్యార్థులు ఒక్కసారిగా దూసుకురావడంతో అప్రమత్తమైన పోలీసులు వారిని నిలువరించారు. ఏవీపీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల ఝాన్సీ నేతృత్వంలో ముట్టడి చేపట్టగా, ఆమెను అదుపులోకి తీసుకునేందుకు మహిళా కానిస్టేబుళ్లు శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆమెతో పాటు విద్యార్థులను అరెస్టు చేసి గోషామహల్‌ స్టేడియానికి తరలించారు. అరెస్టు చేసిన విద్యార్థులను తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని