logo

సీఎం ముందుచూపుతో రాష్ట్రం పురోగతి: ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపు కారణంగా అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగమిస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం మండల పరిధిలోని గంగ్యాడ గ్రామంలో అత్తాపూర్‌, అక్నాపూర్‌, పూలపల్లి, నారెగూడ, లింగంపల్లి, గొల్లగూడ, ఎల్లకొండ, మైతాబ్‌ఖాన్‌గూడ, ముబారక్‌పూర్‌

Published : 27 Mar 2023 01:32 IST

గంగ్యాడలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య  

నవాబ్‌పేట, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపు కారణంగా అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగమిస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం మండల పరిధిలోని గంగ్యాడ గ్రామంలో అత్తాపూర్‌, అక్నాపూర్‌, పూలపల్లి, నారెగూడ, లింగంపల్లి, గొల్లగూడ, ఎల్లకొండ, మైతాబ్‌ఖాన్‌గూడ, ముబారక్‌పూర్‌, గుబ్బడిఫతేఫూర్‌ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, భారాస పార్టీ గ్రామ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే స్వగ్రామం చించల్‌పేటలో రూ.50 లక్షలతో నిర్మించే పంచాయతీ, అంగన్‌వాడీ, బీసీ కమ్యూనిటీ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అందరూ కలిసి సంక్షేమం, అభివృద్ధి  కార్యక్రమాలపై ఆత్మీయంగా మాట్లాడుకోవడమే ఈ కార్యక్రమ ఉద్దేశమన్నారు. పూలపల్లి- ఎల్లకొండ వరకు ఆర్‌ అండ్‌ బీ రోడ్డు అభివృద్ధికి రూ.7కోట్లు మంజూరయ్యాయన్నారు. మండల పరిధిలోని ఆర్కతలలో 500 ఎకరాల్లో ఆహారశుద్ధి, మొబిలిటీ వాహనాల పరిశ్రమలకు భూ అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఏక కాలంలో రుణమాఫీ చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నాయకులు మల్లేశం కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ భవాని, జడ్పీటీసీ జయమ్మ, స్థానిక సర్పంచి ఎంపీటీసీలు గోవిందమ్మ, దయాకర్‌రెడ్డి, ఏఏంసీ, పీఏసీఎస్‌ ఛైర్మన్లు ప్రశాంత్‌గౌడ్‌, పోలీస్‌ రాంరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నాగిరెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని