logo

మోకాలి మార్పిడికి అధునాతన ప్రక్రియ ‘వెలీస్‌’

మోకాలి మార్పిడి ప్రక్రియ కోసం అత్యంత అధునాతనమైన ‘వెలీస్‌’ రోబోటిక్‌ సహాయక సాంకేతికత అందుబాటులోకి వచ్చింది.

Published : 31 Mar 2023 02:44 IST

అందుబాటులోకి తెచ్చిన స్టార్‌ ఆస్పత్రి

వెలీస్‌ రోబోటిక్‌ సాంకేతికతను వెల్లడిస్తున్నడా.ఎన్‌.వి.రమణారెడ్డి

బంజారాహిల్స్‌ న్యూస్‌టుడే: మోకాలి మార్పిడి ప్రక్రియ కోసం అత్యంత అధునాతనమైన ‘వెలీస్‌’ రోబోటిక్‌ సహాయక సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. కీళ్ల, దీర్ఘకాలిక మోకాలినొప్పితో బాధపడుతున్న వ్యక్తులకు ఈ సాంకేతికత ద్వారా అనుకూలమైన రీతిలో ఆశించిన ఫలితాలు పొందవచ్చని వైద్యులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బంజారాహిల్స్‌లోని స్టార్‌ ఆస్పత్రి ఈ వైద్య విధానాన్ని తొలిసారిగా అందుబాటులోకి తెచ్చింది. గురువారం స్టార్‌ ఆస్పత్రిలో విలేకరుల సమావేశంలో స్టార్‌ ఆస్పత్రి కన్సల్టెంటు ఆర్థోపెడీషియన్‌, జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌ డా.నీలం వి.రమణారెడ్డి పాల్గొని వివరాలను వెల్లడించారు. ప్రామాణిక మోకాలి మార్పిడితో పోలిస్తే అతితక్కువ మృదు కణజాలం మాత్రమే గాయం అవుతుందన్నారు. రోబోటిక్‌ సాంకేతికతతో ఇంప్లాంట్‌ అమరిక, శస్త్రచికిత్స కచ్చితత్వం మెరుగుపడతాయన్నారు. శస్త్రచికిత్స అనంతరం సాధారణంగా తలెత్తే చిక్కులను దాదాపు తొలగిస్తుందని వెల్లడించారు. రోగి త్వరితగతిన (48-72 గంటల్లో) కోలుకొనే అవకాశం ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని