logo

అబ్బురపరిచిన ఈత విన్యాసాలు

హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పాఠశాల ఆవరణలో ఒలింపిక్‌ ప్రమాణాలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఈత కొలనును శుక్రవారం ప్రారంభించారు.

Published : 01 Apr 2023 03:01 IST

హెచ్‌పీఎస్‌లో ‘కజక్‌ సింక్రో స్టార్స్‌’ అద్భుత ప్రదర్శన

బేగంపేట, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పాఠశాల ఆవరణలో ఒలింపిక్‌ ప్రమాణాలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఈత కొలనును శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కజకిస్థాన్‌ నుంచి వచ్చిన ‘కజక్‌ సింక్రో స్టార్స్‌’ ఈత బృందం ప్రదర్శించిన అద్భుత విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నీటిపై తేలుతూ ఆర్టిస్టిక్‌ స్విమ్మింగ్‌, ఆక్వాటిక్‌ ఏరోబిక్స్‌తో అదరగొట్టారు. దేశభక్తిని ప్రేరేపించే సంగీతానికి అనుగుణంగా కొలనులో విన్యాసాలు, నృత్యాలు చేస్తూ అలరించారు. అంతకుముందు ఈత కొలనును రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి, హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ ఛైర్‌పర్సన్‌ వాకాటి కరుణ ప్రారంభించారు. ఆమె మట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో విభిన్న రంగాల్లో హెచ్‌పీఎస్‌ పాఠశాల విద్యార్థులు రాణిస్తూ తెలంగాణ ఖ్యాతిని చాటుతున్నారని ప్రశంసించారు. మంచి కార్యక్రమాలకు ప్రభుత్వ తోడ్పాటు ఉంటుందన్నారు. క్రీడలు, విద్యాంశాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలను అందజేశారు. హెచ్‌పీఎస్‌ సొసైటీ అధ్యక్షుడు గుస్తి జె.నోరియా మాట్లాడుతూ.. పాఠశాలలో క్రీడాభివృద్ధి కోసం రూ.25 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. స్విమ్మింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సెక్రటరీ జనరల్‌ మోనల్‌ చోక్సీ, హెచ్‌పీఎస్‌ ప్రిన్సిపల్‌ డా.మాధవ్‌దేవ్‌ సరస్వత్‌, సొసైటీ వైస్‌ ఛైర్మన్‌ రఘురామ్‌రెడ్డి, కార్యదర్శి ఫయాజ్‌ఖాన్‌, మర్రి ఆదిత్యారెడ్డి, రిజిస్ట్రార్‌ కల్నల్‌ శర్మ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని