logo

తాండూరు ఐటీఐకి సామగ్రి

ఎట్టకేలకు తాండూరులో ప్రభుత్వ వృత్తి శిక్షణ కేంద్రం(ఐటీసీ) తరగతులు ప్రారంభం కానున్నాయి. ‘ఈనాడు’లో గత ఐదేళ్లుగా కథనాలు ప్రచురితమయ్యాయి.

Published : 02 Apr 2023 03:19 IST

ఫర్నిచర్‌ను పరిశీలిస్తున్న ప్రిన్సిపల్‌ రామానుజం

తాండూరుగ్రామీణ, న్యూస్‌టుడే: ఎట్టకేలకు తాండూరులో ప్రభుత్వ వృత్తి శిక్షణ కేంద్రం(ఐటీసీ) తరగతులు ప్రారంభం కానున్నాయి. ‘ఈనాడు’లో గత ఐదేళ్లుగా కథనాలు ప్రచురితమయ్యాయి. 2016-17లో కేంద్రం మంజూరైంది. ప్రభుత్వం ప్రిన్సిపల్‌, సహాయ ప్రిన్సిపల్‌, జూనియర్‌, సీనియర్‌ సహాయకులను నియమించింది. దీంతో ఉద్యోగులు భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలంటూ తహసీల్‌, ఆర్డీఓ, పాలనాధికారి కార్యాలయాల చుట్టూ తిరగడంతో తాండూరు-చించోళి జాతీయ రహదారి వారగా ఐదు ఎకరాల భూ కేటాయింపులు పూర్తయ్యాయి. సొంత భవనం నిర్మించేంత వరకు తరగతుల నిర్వహణకు తాత్కాలిక భవనం నిమిత్తం ప్రిన్సిపల్‌ రామానుజం పలుమార్లు పట్టణంలోని ఈసేవా, పాత తాండూరులోని అంబేడ్కర్‌ భవనం, ఇందిరానగర్‌లోని సామాజిక భవనం, పాతమున్సిపల్‌ భవనాలను పరిశీలించారు. రెండున్నరేళ్లుగా ఇదే ప్రక్రియ కొనసాగింది. భవనం సమకూర్చాలంటూ ‘ఈనాడు’లో కథనాలు ప్రచురితమయ్యాయి. స్పందించిన తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఇటీవల పాలనాధికారి నారాయణరెడ్డిని కలిసి భవనం కేటాయింపునకు విన్నవించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాతభవనం, జిన్‌గుర్తి వద్ద నిర్మించిన నైపుణ్యాభివృద్ధి కేంద్రం(స్కిల్‌ డెవలప్‌మెంట్‌) భవనాన్ని వినియోగించుకునేందుకు జిల్లా పాలనాధికారి పచ్చజెండా ఊపారు. దీంతో ప్రిన్సిపల్‌ బృందం శనివారం 15 విగణితలు, ఫర్నిచర్‌, బల్లలను తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని