logo

ఐపీఎల్‌ మ్యాచ్‌లకు కట్టుదిట్టమైన భద్రత

ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో భారీ భద్రతను కల్పిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్‌జోషి తెలిపారు.

Updated : 27 Mar 2024 03:20 IST

ఉప్పల్‌, న్యూస్‌టుడే: ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో భారీ భద్రతను కల్పిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్‌జోషి తెలిపారు. బుధవారం రాత్రి 7.30 గంటలకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో స్టేడియం లోపలే కాకుండా పరిసర ప్రాంతాల్లోనూ 360 సీసీ టీవీలు,  సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశామన్నారు.  మంగళవారం ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో సీపీ తరుణ్‌జోషి, మల్కాజిగిరి డీసీపీ పద్మజతో కలిసి మాట్లాడారు. ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో 39 వేల సీట్లు ఉన్నాయని తెలిపారు. శాంతిభద్రతలకు అన్ని విభాగాలు కలిపి 2800 మందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. స్టేడియం బయట, లోపల మహిళల భద్రతకు ప్రత్యేకంగా షీ టీంలు ఉంటాయన్నారు. అన్ని చోట్లా మఫ్టీలో ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. నకిలీ లేదా బ్లాక్‌లో టికెట్లను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్టేడియంలోకి ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, అగ్గిపెట్టెలు, బైనాక్యులర్స్‌, బ్యాటరీలు, బ్యాగులు, బ్యానర్లు, సిగరెట్లు, లైటర్లు, హెల్మెట్లు, నీళ్ల సీసాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, షార్ప్‌మెటల్స్‌, పెన్నులు, అత్తర్లు, పవర్‌ బ్యాంకులు, బయటి ఆహార పదార్ధాలు, కాయిన్స్‌, తదితర వస్తువులను వెంట తీసుకురావద్దని ప్రేక్షకులకు సూచించారు.


మ్యాచ్‌లకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ఈనాడు, హైదరాబాద్‌: ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌లను తిలకించేందుకు వెళ్లే వారికి టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.  ఈ నెల 27న బుధవారం, వచ్చే నెల 5న జరగనున్న మ్యాచ్‌లకు వీక్షకుల సౌకర్యార్థం సర్వీసులుంటాయని గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం 24 డిపోల నుంచి .. 60 బస్సులు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11.30గంటల వరకూ నడుస్తాయని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని