logo

మహమ్మారిపై అప్రమత్తత అవసరం

ప్రమాదకర ఎయిడ్స్‌పై అప్రమత్తత అవసరమని, ఎయిడ్స్‌పై సందేహాలు ఉన్నవారు ఉచిత హెల్ప్‌లైన్‌ నంబరు 1097ను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్‌ జీవరాజ్‌ అన్నారు.

Published : 29 Mar 2024 03:24 IST

మాట్లాడుతున్న  డాక్టర్‌ జీవరాజ్‌

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రమాదకర ఎయిడ్స్‌పై అప్రమత్తత అవసరమని, ఎయిడ్స్‌పై సందేహాలు ఉన్నవారు ఉచిత హెల్ప్‌లైన్‌ నంబరు 1097ను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్‌ జీవరాజ్‌ అన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక మహావీర్‌ వైద్య కళాశాలలో వైద్యశాఖ సిబ్బందికి హెచ్‌ఐవీ నియంత్రణపై ఒకరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్ప్‌లైన్‌ నంబర్‌ను గ్రామాల్లో ప్రచారం చేయాలని తెలిపారు. ఎయిడ్స్‌ వ్యాధి ఏ విధంగా సోకుతుందో ముమ్మరంగా ప్రచారం చేయాలన్నారు.  హెచ్‌ఐవీ పాజిటివ్‌ అని తెలిస్తే ఏఆర్‌టీ మందులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ రవీంద్రయాదవ్‌, అధికారులు, డాక్టర్లు కె.వి.ఎన్‌. మూర్తి, నరేందర్‌, రమేశ్‌, నాగేశ్వరరావు, బాలరాజ్‌, గోవర్ధన్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని