logo

Khammam: 45 ఏళ్ల భవనాన్ని.. జాకీలతో 4 అడుగుల ఎత్తుకు..!

చర్లలోని 45 ఏళ్ల కిందట నిర్మించిన భవనం రానురాను రహదారికి దిగువగా మారడంతో పాటు ఇంట్లోకి వర్షాకాలం వరదనీరు వస్తూ ఇబ్బంది నెలకొంది.

Updated : 11 Nov 2023 08:43 IST

భవనాన్ని పైకి ఎత్తే క్రమంలో ఏర్పాటు చేసిన జాకీలు

చర్ల, న్యూస్‌టుడే: చర్లలోని 45 ఏళ్ల కిందట నిర్మించిన భవనం రానురాను రహదారికి దిగువగా మారడంతో పాటు ఇంట్లోకి వర్షాకాలం వరదనీరు వస్తూ ఇబ్బంది నెలకొంది. దీంతో భవన జయమాని ఆవుల శివప్రసాద్‌ జాకీలతో భవనాన్ని నాలుగు అడుగుల మేర పైకి లేపే పనులు చేయిస్తున్నారు. ఇలా ఎత్తు లేపేందుకు రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతోందని తెలిపారు. పిల్లర్లను కత్తిరించి జాకీల ద్వారా లేపిన అనంతరం పిల్లర్ల మధ్యలో ఐరన్‌తో జాయింట్‌ చేసి కాంక్రీటు చేస్తారని తెలిపారు. ఈ లిఫ్టింగ్‌ విధానాన్ని హైదరాబాద్‌లో చూసి సత్ఫలితాలు వచ్చాయని తెలుసుకున్నాకే తన భవనాన్ని ఎత్తు లేపాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు