logo

దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా కాంగ్రెస్‌ పాలన: తుమ్మల

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలుచేస్తూ ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిలో దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలిచేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ పాలన సాగిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Published : 17 Apr 2024 02:58 IST

 

మహబూబాబాద్‌లో సభా వేదిక ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలుచేస్తూ ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిలో దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలిచేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ పాలన సాగిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబాబాద్‌లోని డీసీసీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతే రైతులకు పరిహారం వచ్చే పంటల బీమా పథకాన్ని భారాస సర్కారు అమలుచేయలేదని విమర్శించారు. రైతులకు రూ.2 లక్షల చొప్పున రుణమాఫీ, బోనస్‌ హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చబోతోందని తెలిపారు. పంటల బీమాకు తమ ప్రభుత్వమే రూ.3వేల కోట్ల ప్రీమియం  చెల్లిస్తుందన్నారు. ఈ ప్రక్రియను వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం నాటికి    పూర్తిచేస్తామని చెప్పారు. మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాంనాయక్‌ నామినేషన్‌ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం హాజరవుతారని వెల్లడించారు. సీఎం బహిరంగ సభ జరిగే ఎన్టీఆర్‌ స్టేడియాన్ని మంత్రి పరిశీలించారు. అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌, ఎమ్మెల్యేలు    దొంతి మాధవరెడ్డి, భూక్యా మురళీనాయక్‌,   రాంచంద్రునాయక్‌, తెల్లం వెంకట్రావ్‌, పాయం  వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని