logo

లక్ష్య సాధనకు కృషి చేయండి: ఆయిల్‌ఫెడ్‌ ఎండీ

లక్ష్యసాధనకు కృషి చేయాలని ఉద్యానశాఖ కమిషనర్‌, టీజీ ఆయిల్‌ఫెడ్‌ ఎండీ కె.అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అశ్వారావుపేట, అప్పారావుపేట పామాయిల్‌ పరిశ్రమలు, నిర్మాణంలో ఉన్న యూనిట్లు, ఆయిల్‌పాం నర్సరీలు, అల్లిపల్లి, గంగారంలో రైతుల క్షేత్రాలను మంగళవారం పరిశీలించారు.

Published : 17 Apr 2024 02:58 IST

అశ్వారావుపేట, దమ్మపేట: లక్ష్యసాధనకు కృషి చేయాలని ఉద్యానశాఖ కమిషనర్‌, టీజీ ఆయిల్‌ఫెడ్‌ ఎండీ కె.అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అశ్వారావుపేట, అప్పారావుపేట పామాయిల్‌ పరిశ్రమలు, నిర్మాణంలో ఉన్న యూనిట్లు, ఆయిల్‌పాం నర్సరీలు, అల్లిపల్లి, గంగారంలో రైతుల క్షేత్రాలను మంగళవారం పరిశీలించారు. నర్సరీలో వివిధ దశల్లో పెరుగుతున్న తొమ్మిది లక్షల మొక్కలపై ఆరాతీశారు. టీజీ ఆయిల్‌ఫెడ్‌ జనరల్‌ మేనేజర్‌ సుధాకర్‌రెడ్డి, ప్రాజెక్ట్స్‌ అండ్‌ ప్లాంట్స్‌ మేనేజర్‌ శ్రీకాంత్‌రెడ్డి, డివిజనల్‌ మేనేజర్‌ బాలకృష్ణ, పరిశ్రమ మేనేజర్లు కల్యాణ్‌, నాగు, కొత్తగూడెం, ఖమ్మం డీహెచ్‌ఎస్‌ఓలు సూర్యనారాయణ, భారతి పాల్గొన్నారు. నర్సరీలో అవకతవకలపై విచారణ జరపాలంటూ కమిషనర్‌కు ఆయిల్‌పాం అశ్వారావుపేట జోన్‌ రైతుసంఘం అధ్యక్ష, కార్యదర్శులు తుంబూరి మహేశ్వరరెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్య వినతిపత్రం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని