logo

రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రాధాన్యం

దేశంలో రైల్వేస్టేషన్ల అభివృద్ధి భాజపా ప్రభుత్వ హయాంలోనే జరుగుతోందని రైల్వే సేఫ్టీ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ అన్నారు. కర్నూలు రైల్వేస్టేషన్‌లో జరిగిన అభివృద్ధి పనులను రాజ్యసభ సభ్యుడు జీవీఎ

Published : 23 Jan 2022 02:16 IST


రైల్వేస్టేషన్‌ను పరిశీలిస్తున్న రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌, జీవీఎల్‌

నరసింహారావు, డా.పార్థసారథి వాల్మీకి తదితరులు

 

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: దేశంలో రైల్వేస్టేషన్ల అభివృద్ధి భాజపా ప్రభుత్వ హయాంలోనే జరుగుతోందని రైల్వే సేఫ్టీ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ అన్నారు. కర్నూలు రైల్వేస్టేషన్‌లో జరిగిన అభివృద్ధి పనులను రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావుతో కలిసి శనివారం పరిశీలించారు. కర్నూలు స్టేషన్‌ మీదుగా ఎన్ని రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయో తెలుసుకున్నారు. కర్నూలు రైల్వేస్టేషన్‌ను రూ.15 కోట్లతో అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. పంచలింగాల వద్ద కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న వర్క్‌షాపు పనులు పూర్తి చేసి త్వరలో ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో వివిధ రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాల్సి ఉందని వెల్లడించారు. జీవీఎల్‌ నరసింహరావు మాట్లాడుతూ ప్రయాణికుల వసతులకు అధిక ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. వారి వెంట రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ సంపత్‌కుమార్‌, ఓబీసీ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ పార్థసారథి వాల్మీకి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరీష్‌బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్‌ వినూషారెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని