logo

ఓడిపోతామనే భయంతో ప్రజలను పక్కదారి పట్టించే చర్యలు

వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే వైకాపా వారు ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం పేరు మార్చి వైఎస్సార్‌ పేరు పెట్టే చర్యలకు పాల్పడుతున్నారని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ధర్మవరం సుబ్బారెడ్డి ఆరోపించారు.

Published : 02 Oct 2022 01:56 IST

దీక్షలో కూర్చున్న తెదేపా నాయకులు

డోన్‌, న్యూస్‌టుడే: వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే వైకాపా వారు ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం పేరు మార్చి వైఎస్సార్‌ పేరు పెట్టే చర్యలకు పాల్పడుతున్నారని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ధర్మవరం సుబ్బారెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయానికి పేరు మార్పుపై తెదేపా నాయకులు శనివారం ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ మాట్లాడుతూ... ఎన్టీఆర్‌ సమాజానికి వైద్యం అందించిన మహోన్నతమైన వ్యక్తమన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి కొత్త యూనివర్సిటీలు నిర్మించి వాటికి వైఎస్సార్‌ పేరు పెట్టుకోవాలి, కానీ ఇలా మహానుభావుని పేరును తొలగించడం భావ్యం కాదన్నారు.  సాయంత్రం సుబ్బారెడ్డి నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు, నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి విజయభట్టు, బీసీ సెల్‌ అధ్యక్షులు మల్లికార్జున, యువ నాయకులు గౌతంరెడ్డి, పార్టీ కార్యదర్శి గోవిందు, మండల అధ్యక్షులు శ్రీనివాసులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని