logo

నూతన దంపతులకు తాళి బొట్లు, మెట్టెలు అందజేత

కౌతాళం మండలం పొదులకుంట మదిరి గ్రామంలో ప్రతి ఏటా ఉటగునూరు శ్రీ బసవలింగప్ప తాత మఠంలో పంపాపతి తాత అధ్వర్యంలో పేదవారికి ఉచిత వివాహాలు నిర్వహించడం జరుగుతుంది.

Updated : 16 Apr 2024 16:34 IST

కౌతాళం: కౌతాళం మండలం పొదులకుంట మదిరి గ్రామంలో ప్రతి ఏటా ఉటగునూరు శ్రీ బసవలింగప్ప తాత మఠంలో పంపాపతి తాత అధ్వర్యంలో పేదవారికి ఉచిత వివాహాలు నిర్వహించడం జరుగుతుంది. 14 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం ఈ మఠంలో జరుగుతున్న వివాహాలు కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి నూతన దంపతులకు ప్రతి సంవత్సరం తాళి బొట్లు, మెట్టెలు విరాళంగా ఇస్తున్నారు. ఈ ఏడాది తాళి బొట్లు, మెట్టెలను మఠం పెద్దలకు తెదేపా రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సంప్రదాయ పద్ధతిలో ప్రతి సంవత్సరం పేదలకు సహాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చావిడి వెంకటేష్, భీమన్న ఆచారి, తెదేపా నియోజకవర్గ అధ్యక్షుడు సల్మాన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని