logo

ఉపాధి హామీలో అవినీతి ఆగేనా..!

పేద ప్రజలకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతి, అక్రమాలు ఆగడం లేదు.

Published : 17 Apr 2024 05:35 IST

బల్మూర్‌లో సామాజిక తనిఖీ నిర్వహిస్తున్న అధికారులు (పాత)

అచ్చంపేట న్యూటౌన్‌, న్యూస్‌టుడే : పేద ప్రజలకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతి, అక్రమాలు ఆగడం లేదు. ఏటా నిధుల వినియోగం, ఖర్చుపై సామాజిక తనిఖీ బృందాలు క్షేత్ర స్థాయిలో విచారణలు చేసి జరిమానా విధిస్తున్నా.. అధికారులు, సిబ్బంది పనితీరులో మార్పు రావడం లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ది పనుల పై పర్యవేక్షణ లోపించడం, రికార్డుల నిర్వహణపై చూసి చూడనట్లు వ్యవహరించడంతో మండల స్థాయి సిబ్బంది అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. సామాజిక తనిఖీ వేదికలే లక్ష్యంగా అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నప్పటికి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. దీంతో మండల స్థాయిలో అవినీతి అక్రమాలు ఆగడం లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనుల పై ఇటీవల నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వెల్దండ, బల్మూర్‌, కొల్లాపూర్‌ మండలాల్లో మినహా 17 మండలాల్లో నిర్వహించిన సామాజిక తనిఖీలలో గుర్తించిన అవినీతి, అక్రమాలు అధికారుల నివేదికల ప్రకారం ఇలా ఉన్నాయి.

అచ్చంపేట కార్యాలయం వద్ద వదిలేసిన బోర్డులు

ఈజిఎస్‌ పథకంలో చేపడుతున్న అభివృద్ది పనులలో పంచాయతీ కార్యదర్శులు, క్షేత్ర సహాయకులు  రికార్డుల నమోదులో అలసత్వం వహించడం, కూలీలకు కూలీ చెల్లింపులో జాప్యం వహించడం, హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ పై నిర్లక్ష్యం వహిస్తున్నప్పటికి జిల్లా స్థాయి అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అచ్చంపేట మండలంలో సామాజిక తనిఖీ పూర్తయినప్పటికి సూచిక బోర్డులు మాత్రం కార్యాలయ ప్రాంగణంలోనే దర్శనమిస్తున్నాయి. చాలా గ్రామాల్లో హరితహారం మొక్కలు మంటలలో కాలిపోవడం, నీళ్లు లేక ఎండిపోతున్నా.. పర్యవేక్షణ కొరవడింది. ఇప్పటికైనా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.  

నోటీసులు అందజేస్తున్నాం..: మండల స్థాయిలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు, సిబ్బందికి నోటీసులు అందజేస్తున్నాం. దస్త్రాలను సవరించి రకవరి మొత్తాన్ని వసులు చేసే విధంగా చర్యలు చేపడుతున్నాం. ఎంపీడీవోల సహకారంతో ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షిస్తున్నాం. సామాజిక తనిఖీ గ్రామసభల్లో చేపట్టిన పనులు, నిధుల ఖర్చుపై పర్యవేక్షణ చేస్తున్నాం.

చిన్న ఓబులేశు, జిల్లా గ్రామీణావృద్ధి అధికారి నాగర్‌కర్నూల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని